Friday, April 26, 2024
- Advertisement -

‘నోబెల్’ ప్రశంస.. ఎల్లలుదాటిన జగన్ పాలన

- Advertisement -

పేదల కష్టాలు తీర్చేందుకు 3వేల కి.మీలకు పైగా నడిచాడు. వారి కష్టాలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నాడు. ప్రజల కష్టాల తీర్చేందుకు నడుంబిగించాడు. సీఎం అయ్యాడు. వెంటనే నవరత్నాలను అమలు చేశాడు. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నా మొక్కవోని పట్టుదలతో దేశంలోనే ఏ సీఎం సాహసించని రీతిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టారు. రైతుభరోసా, అమ్మ ఒడి పేరిట ప్రభుత్వ విద్యార్థుల కుటుంబాలకు 15వేలు పంచిపెట్టారు. ఒక్కటేమిటీ సీఎం జగన్ రాజన్న రాజ్యాన్ని తిరిగితెచ్చారు. జగన్ పాలనకు ఏపీ ప్రజలే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులైపోయారు. ఇప్పుడు ఇదే కోవలో ఓ నోబెల్ బహుమతి గ్రహీత, ప్రపంచ మేధావి అయిన ప్రముఖ శాస్త్రవేత్త జాన్ బి గుడెనఫ్ కూడా జగన్ పాలనకు మైమరిచిపోయాడు.

జర్మనీ దేశానికి చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త జాన్ బి గుడెనఫ్ 2019వ సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి దక్కించుకున్నాడు. మన జీవిన విధానంలో భాగమైపోయిన స్మార్ట్ ఫోన్ లో వాడే ‘లిథియమ్-ఇయాన్’ బ్యాటరీ క్యాథోడ్ ను కనుగొన్నదే గుడెనఫ్. ఈ ఆవిష్కరణకు గాను ఆయనకు ఈ అరుదైన పురస్కారం దక్కింది.

తాజాగా శాస్త్రవేత్త గుడెనఫ్ ను అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు, ఆయన భార్య రాజేశ్వరిలు ప్రత్యేకంగా కలిశారు. అమెరికా, భారతీయ విద్యా విధానంపై చర్చించారు.వీరి సంభాషణలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ప్రజల జీవన ప్రమాణాలను మార్చడానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇవన్నీ విన్న గుడెనఫ్ ఆశ్చర్యపోయారు. ప్రపంచంలోనే ఇంతటి అద్భుత సంక్షేమ రాజ్యం ఏపీలో ఉండడంపై ప్రశంసలు కురిపించారు. రైతు భరోసా, అమ్మఒడి తదితర పథకాలు, వాటి లక్ష్యాల గురించి వినగానే జగన్ పై ఒక వీడియోలో మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు.

గుడెనఫ్ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు ఖచ్చితంగా మానవాభివృద్ధి సూచికను మెరుగుపరుస్తాయి.. ప్రజల ఆర్థికవృద్ధికి తోడ్పడుతాయని ఆయన మెచ్చుకున్నారు. ప్రజాసంక్షేమ పాలనలో తాను చూసిన బెస్ట్ సీఎం జగన్ అంటూ వేయినోళ్ల పొగిడేశారు. జగన్ కు దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఓ గొప్ప మేధావి, నోబెల్ బహుమతి గ్రహీతన నుంచి ఈ ప్రశంస దక్కడం సోషల్ మీడియా, మీడియాలోనూ చర్చనీయాంశమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -