Friday, April 26, 2024
- Advertisement -

విజయసాయి రెడ్డి ఫిర్యాదు పై స్పందించిన రాష్ట్రపతి

- Advertisement -

రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై, ఆయన అక్రమ కంపెనీలపై, ఆయన మనీ లాండరింగ్‌ వ్యవహారాలపై, అంతర్జాతీయ స్థాయిలో ఆయన పాల్పడ్డ వ్యాపార కుంభకోణాలపై విజయసాయి రెడ్డి భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ రాశారు.

ఆ లేఖలో ఆయన సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఈడీ, సీబీఐ చేత ధర్యాప్తు చేయించాలని కోరారు.

ఆ లేఖకు స్పందించిన రాష్ట్రపతి దానిని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపారు.

సాక్షాత్తూ రాష్ట్రపతి నుంచే విజయసాయి రెడ్డి లేఖ… రాష్ట్రపతి కార్యాలయం నోట్‌తో రీ-డైరెక్ట్‌ కావడంతో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ లేఖను సంబంధిత శాఖలకు పంపింది.

విజయసాయి రెడ్డి లేఖకు స్పందించి విచారణ ప్రారంభం అయితే సుజనా చౌదరి ఇబ్బందుల్లో పడడం ఖాయం. అయితే ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయనపై కేంద్రం విచారణకు ఆదేశిస్తుందా?లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -