Saturday, April 27, 2024
- Advertisement -

కేటీఆర్ ఆధ్యాత్మిక బాట.. కారణమదేనట..?

- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ లో భక్తిభావం ఎక్కువ. ఆయన స్వతహాగానే తరుచుగా ఆలయాలు సందర్శిస్తూ మొక్కులు చెల్లించుకుంటూ పూజలు, పునస్కారాలు, యాగాలు, హోమాలు చేస్తుంటారు. కానీ కేసీఆర్ తోపాటు కేటీఆర్ ఎప్పుడూ కనిపించరు. కేసీఆర్ ను అనుసరించరు.

మంత్రి కేటీఆర్ ఎప్పుడూ నాస్తికుడిని అని చెప్పుకోనప్పటికీ ఏ మతపరమైన కార్యక్రమం వేడుకల్లో పాల్గొనకుండా ఆచారాలు పాటించకుండా దూరంగా ఉంటారు. కేసీఆర్ ఎల్లప్పుడూ దేవాలయాల సందర్శనతో కాలం గడుపుతుండగా.. కేటీఆర్ మాత్రం గత 10 సంవత్సరాలుగా దేవాలయాలను సందర్శించలేదు.

కేసీఆర్ గతంలో తిరుమలకు వెళ్లినప్పుడు కూడా కేటీఆర్ ఆయనతోపాటు వెళ్లలేదు. కానీ కేటీఆర్ కొడుకు, కుమార్తె మాత్రం ఎప్పుడూ కేసీఆర్ తోనే కనిపిస్తారు.

కేసీఆర్ సహస్ర చండీయాగం.. సుదర్శన యాగం లాంటి భారీ యాగాలు చేసినప్పటికీ కేటీఆర్ ఎక్కడా కనిపించలేదు. దీన్ని బట్టి కేటీఆర్ దేవుడిని నమ్మడని.. నాస్తికుడని అందరూ భావిస్తుంటారు.

అయితే తాజాగా కేటీఆర్ లోనూ మార్పు వచ్చింది. పూర్తిగా భక్తిభావంలోకి కేటీఆర్ మారిపోయాడు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడన్న చర్చ సాగుతోంది. గత నెలలో కేసీఆర్ తోపాటు సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరి స్వామిని కేటీఆర్ దర్శించుకున్నారు. సోమవారం వైకుంఠ ఏకదాశికి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు.

తిరుమలలో కేటీఆర్ కు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలలో మొదటి సారి కేటీఆర్ తిరుమలకు వచ్చారు. కేటీఆర్ ఇలా ఆధ్యాత్మికత బాట పట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

అయితే కేటీఆర్ ఇలా మారిపోయి దేవాలయాల బాటపట్టడానికి ప్రధాన కారణం కేసీఆర్ అని ఉన్నత స్థాయివర్గాలు తెలిపాయి. కేటీఆర్ కు ఈసంవత్సరం జాతకం ప్రకారం ‘రాజయోగం ’ ుందని.. దీనిని సాధించడానికి, దేవతలను ఆరాధించాలని.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఆ రాజయోగం పడుతుందని ఉందట.. అందుకే కేసీఆర్ సలహా మేరకు రిస్క్ తీసుకోవద్దనే ఎలాంటి అవకాశాలను జారవిడుచుకోవద్దని కేటీఆర్ ఇలా ఆధ్మాత్మిక బాట పట్టినట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -