Friday, April 26, 2024
- Advertisement -

శ‌బ‌రిమ‌ళ వివాదానికి శుభం కార్డు వేసిన ట్రావెణ్ కోర్ బోర్డ్‌ …

- Advertisement -

శ‌బ‌రిమ‌ళ ఆల‌యంలోకి అన్ని వ‌య‌స్సు మ‌హిళ‌లు ప్ర‌వేశంపై జ‌రుగుతున్న వివాదానికి సుభం కార్డు ప‌డింది. ఇక నుంచి ఆల‌యంలోకి అన్ని వ‌య‌సుల మ‌హిళ‌లంద‌ర్నీ అనుమ‌తిస్తూ ట్రావెన్ కోర్ నిర్ణ‌యం తీసుకుంది.దీంతో ఇకపై స్వామి దర్శనానికి మహిళలకు కూడా వయస్సుతో నిమిత్తం లేకుండా వెళ్లే అవకాశం లభించింది. సుప్రీంకోర్డు తీర్పుకు మద్ధతు ఇస్తామని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. సుప్రీం నిర్ణ‌యాన్ని గౌవ‌రిస్తామ‌ని తెలిపింది.

ఆయ‌ల ప్ర‌వేశంపై గ‌తంలో దాదాపు 60 కిపైగా రివ్యూ పిటిష‌న్లు దాఖ‌ల‌యిన సంగ‌తి తెలిసిందే. రివ్యూపిటిష‌న్‌ల‌పై విచార‌ణ ముగిసింది. తీర్పును వాయిదా వేసింది సుప్రీం. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు దేవస్థానం లాయర్ రాకేష్ ద్వివేది ప్రకటించారు. శబరిమల వివాదం రెండు వర్గాల మధ్య సమస్య కాదని ఒక మతానికి సంబంధించిన అంశమని బోర్డు ఈ సందర్భంగా పేర్కొంది .

రాజ్యాంగ ధర్మాసనంలోని జస్టిస్ ఇందు మల్హోత్రా బోర్డు తరపు న్యాయవాదిని ఉద్దేశించి మాట్లాడుతూ రిట్ పిటిషన్లపై తీర్పు సందర్భంగా చేసిన వాదనలో మార్పు వచ్చిందా? అని అడిగారు. దీనిపై బోర్డు తరపు న్యాయవాది సమాధానం చెప్తూ ‘‘ఔను, తీర్పును గౌరవించాలని బోర్డు నిర్ణయించింది, దీనికి సంబంధించి దరఖాస్తు కూడా చేసింది’’ అని చెప్పారు.

శబరిమల అయ్యప్ప ఆలయ కేసు తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం ఎదుట పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీజేఐ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలో జస్టిస్‌ ఆర్‌ఎఫ్ నారిమన్‌, ఏఎం ఖన్విల్కర్‌, డీవై చంద్రచూడ్‌, ఇందు మల్హోత్రా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -