ట్రంప్ ఉండే హోటల్ ఒక్క రోజు ఖర్చు ఎంతంటే ?

1236
Trump to stay at ITC Maurya's Chanakya Suite
Trump to stay at ITC Maurya's Chanakya Suite

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన సతీమణి మెలానియాతో కలిసి న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్యా లగ్జరీ హోటల్, 14వ అంతస్తులో ఉన్న చాణక్యా గ్రాండ్ ప్రెసిడెన్షయల్ సూట్ లో బస చేయనున్నారు. ట్రంప్ ఈ హోటల్ లో దాదాపుగా ఒక రోజు ఉండనున్నారు.

అందుకు ఈ హోటల్ 8 లక్షలు తీసుకుంటుంది. ఇది కాకుండా, హోటల్ లోని 428 గదులను అమెరికా అధికారులు, ఇతర ట్రంప్ సిబ్బందికి కేటాయించారు. వీటి అద్దెను కూడా కలిపితే, మొత్తం ఐటీసీకి కోట్లలోనే ముడతాయి. ఇక ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్ నర్ తదితరులు, మరో సూట్ రూమ్ లో బస చేస్తారు. ట్రంప్ తో పాటు అమెరికా నుంచి వచ్చిన అధికారులు, మీడియా సిబ్బందికి కూడా ఇదే హోటల్ లో గదులు కేటాయించారు. ఇక ట్రంప్ రెస్ట్ తీసుకునే గదిని స్పెషల్ గా రెడీ చేశారు.

ఈ గదిలో 12 మంది కలిసి కూర్చుని భోజనం చేసే సదుపాయంతో పాటు, రిసెడ్షన్, మినీ జిమ్, ప్రత్యేక స్పా కూడా ఉన్నాయి. ఇక ట్రంప్ కోసం ఆయనకు ఇష్టమైన చెర్రీ వెనీలా ఐస్ క్రీమ్, డైట్ కోక్ తదితరాలను సూట్ లో సిద్ధంగా ఉంచారు. ట్రంప్ దంపతులకు వండి వడ్డించేందుకు ప్రత్యేక చెఫ్ ను అందుబాటులో ఉంచారు. ఇక చాణక్య ప్రెసిడెన్షియల్ సూట్ లో గతంలో బిల్ క్లింటర్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామాలు ఇండియా పర్యటనకు వచ్చిన సమయంలో బస చేశారు.

Loading...