Saturday, April 27, 2024
- Advertisement -

రిజైన్ చేయకపోతే.. బౌన్సర్లతో కొట్టిస్తున్నారు

- Advertisement -

కార్పొరేట్ కంపెనీలతో ఉద్యోగ భద్రత గురించి పలువురు పలు రకాలుగా గొప్పగొప్పగా మాట్లాడుతుంటారు. ఐదంకెల జీతం… ఆరు నక్షత్రాల హోటళ్లలో సంబరాలు అంటూ ఓ ఊదర గొడుతుంటారు. కాని ఇపుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వన్సపాన్ ఎ టైమ్ మోజులు తగ్గాయి. అలాగే జామ్ గ్యారంటీ కూడా లేకుండా పోయింది. పింక్ స్లిప్ హార్ట్ ఎటాక్ వచ్చేలా చేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే… మాస్ ఫీల్డ్ లో ఉండే బలవంతపు రిజైన్లు కూడా ఇపుడు ఐటి రంగంలోకి వచ్చేసాయంటే ఆశ్చర్యం కలగక మానదు.

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ వెరిజాన్…. యవ్వారం తాజాగా కాంట్రవర్సీ అవుతుంది. రెండు రోజులుగా ఈ కంపెనీ ఉద్యోగులలో కొందరిని బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని తెలిసింది. అయితే రాజీనామాలు చేయించడమంటే… ఏదో పింక్ స్లిప్ చేతిలో పెట్టి దొబ్బేయ్ మనడం కాదు. ఇది అమెరికాలో తరుచూ జరుగుతూ ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా అత్యంత దారుణంగా వ్యవహరిస్తోన్న తీరు పలువురుని ఆందోళనకు గురి చేస్తోంది. జస్ట్ రెండే రెండు రోజుల వ్యవధిలో…. దాదాపు 250 నుంచి 300 మంది ఐటీ ఉద్యోగుల్ని ఈ సంస్థ ఇంటికి పంపేసిందని తెలుస్తుంది. వీరిని ఇంటికి పంపడం కోసం ఏకంగా బౌన్సర్లను ఉపయోగిస్తున్నట్లు ఈ కంపెనీలోని కొందరు ఉద్యోగులు చెప్పారని వార్తలు బయటకు వస్తున్నాయి.

ముందుగా ప్లాన్ ప్రకారం సంస్థ…. తమ ఉద్యోగుల్ని హెచ్ ఆర్ విభాగం వారు పిలిపించటం.. జస్ట్ ఐదు నిమిషాల వ్యవధిలో ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆదేశించడం చేస్తున్నారని.. చేయమన్న వారిని బౌన్సర్ల చేత బలప్రయోగం చేయించి రాజీనామా పత్రం మీద సంతకం చేయిస్తున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. చివరకు రాజీనామా కోసం పిలిపించిన టైమ్లో క్యాబిన్ లో ఓ సైక్రియాటిస్ట్.. ఇద్దరు బౌన్సర్లను ముందస్తుగా ఉంచుతున్నారని.. ఉద్యోగి ఏ మాత్రం కంపెనీ చెప్పినట్లు చేయకుంటే.. ముందుగా వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని.. అప్పటికి నేనొప్పుకోను అంటే ఉద్యోగిపై బౌన్సర్లను ప్రయోగిస్తున్నట్లుగా బాధిత ఉద్యోగి ఒకరు ప్రముఖ మీడియా సంస్థకు వెల్లడించినట్లు ప్రకటించింది. ఇలా ఉద్యోగుల్ని తొలగించే విషయంలో ఒక్క హైదరాబాద్ లోనే కాదు.. చెన్నైలోనూ ఇదే రీతిలో వెరిజాన్ వ్యవహరిస్తోందన్న మాట వినిపిస్తోంది.వేరిజాన్ మాదిరిగానే ఇంకో పది పదిహేను కంపెనీలు ఇలాగే చేసినట్లయితే… తెలుగు ప్రాంతంలో ఐటి అల్లుళ్ల పిచ్చిపోతుందని…ఫార్మసితో పాటు డొమైన్ బేస్డ్ ఉద్యోగులకు పెళ్లిళ్ళు అవుతాయని కొందరు సరదాగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -