బ్రేకింగ్ : ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా పాజిటివ్..!

279
amzad basha tested positive for corona virus
amzad basha tested positive for corona virus

కరోనాకు ఎవరైన ఒక్కటే.. సామాన్యల నుంచి సెలబ్రిటీలు.. రాజకీయనాయకులకు కూడా కరోనా విడిచిపెట్టడం లేదు. తాజగా కరోనా బారిన పడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. ఇప్పటికే చాలా మంది ప్రముఖలకు కరోనా పాజిటీవ్ వచ్చింది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికి.. చిన్న చిన్న పొరపాటుల కారణంగా కరోనా బారిన పడుతున్నారు.

రోజు రోజుకి ఈ కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. అందుకే రాజకీయ నేతలతోపాటు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా ఈ కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాకు కరోనా పాజిటివ్ గా తేలటమే కాదు.. ఆయన ఫ్యామిలీలోని పలువురుకు సైతం కరోనా సోకింది. తాజాగా ఆయనతో పాటు.. ఆయన సతీమణి.. కుమార్తెలకు పాజిటివ్ గా తేలింది.

దాంతో మెరుగైన చికిత్స కోసం తన ఫ్యామిలీతో సహా తిరుపతిలోని స్విమ్స్ నుంచి హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. కరోనా ప్రారంభంలో ఏపీ డిప్యూటీ సీఎం మీద మర్కజ్ వెళ్లివచ్చినట్లుగా విమర్శలు వచ్చాయి. అక్కడికి వెళ్లి వచ్చి కూడా ఆ సమాచారాన్ని ఇవ్వలేదన్న మాట ఉంది. అయితే.. ఆ ఆరోపణలపై డిప్యూటీ సీఎం స్పందించింది లేదు. ఇది ఇలా ఉంటే.. చాలా జాగ్రత్తగా ఉంటున్నా.. డిప్యూటీ సీఎం ఇంట్లోని వారికి పాజిటివ్ రావటం ఆశ్చర్యనికి గురి చేస్తోంది.

ఏపీలో కరోనా వల్ల ఒక్క రోజులో 17 మంది మృతి..!

జగన్ సర్కార్ కీలక నిర్ణయం : ఇంటికే ఐసోలేషన్ కిట్

జగన్ ను తక్కువ అంచనా వేసిన సోనీయా గాంధీ..!

ఎమ్మెల్యే పదవికి వల్లభనేని రాజీనామా ?

Loading...