Friday, April 26, 2024
- Advertisement -

జగన్ సంచలనం.. బాబు గగ్గోలు.. పచ్చమీడియాకు చెక్

- Advertisement -

జీవో 2430. జగన్ సర్కారు తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. పరువుకు నష్టం కలిగించేలా నిరాధార కథనాలు రాసినా.. ప్రసారం చేసినా సదురు మీడియా సంస్థలపై కేసు పెట్టడానికి అధికారులకు అధికారం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్ కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం మీడియా వర్గాలను షాక్ కు గురిచేసింది. తప్పుడు వార్తలు ప్రచురించినా.. ప్రసారం చేసినా.. ముద్రించినా, ఎలక్ట్రానిక్ ,సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పరువు నష్టం కలిగించే వార్తలకు వ్యతిరేకంగా చట్టబద్దంగా ప్రభుత్వ , సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు.

ప్రతిపక్ష, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు ఈ జీఓ విడుదలపై తీవ్రంగా స్పందించారు. దానిని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ఇది భావ ప్రకటనా స్వేచ్చను అరికట్టగలదని , సోషల్ మీడియాలో ప్రజల గొంతును అరికట్టడానికి ఉద్దేశించినదని ఆయన అన్నారు.ఈ జిఓ రద్దు అయ్యే వరకు మేము పోరాడుతామన్నారు.

కార్యదర్శలకు అధికారం ఇస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది . ఈ చర్యతో జర్నలలిస్టుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు ప్రతిపక్ష పార్టీల నుండి నిరసనను రేకెత్తించింది.

సమాచార, ప్రజా సంబంధాల కమిషనర్ కేసులు దాఖలు చేయడం చివరి ప్రయత్నమని ప్రభుత్వం స్పష్టం చేసింది తప్పుగా ప్రచురించినా, చానెళ్లలో వేసిన వార్గలకు ప్లేస్ మెంట్ / టైమ్ స్లాట్ తో సహా సాక్షంగా తీసుకొని వారిపై చర్యలు చేపడుతారు.

ఇప్పటికే కేవలం ఆరు నెలలు కూడా కాకుండానే వైసీపీ ప్రభుత్వాన్ని అల్లకల్లోలం చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకూల పచ్చమీడియా, జాతీయ మీడియా చేస్తున్న విష ప్రచారం అంతా ఇంతాకాదు.. ఈనేపథ్యంలోనే ప్రజల్లోకి గోబెల్స్ గా తప్పుడు ప్రచారాన్ని చేస్తూ జగన్ సర్కారును ఇరుకునపెడుతున్నారు. అందుకే జగన్ సర్కారు ఈ విచ్చలవిడిగా, విశృంఖలంగా చెలరేగిపోతున్న టీడీపీ మీడియాను వారి తప్పుడు వార్తలను కంట్రోల్ చేయడానికి ఈ చర్యకు దిగింది. ఇదే చంద్రబాబు అధికారంలో ఉండగా సాక్షి మీడియాను నిషేధించిన విషయం గుర్తులేదా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కేవలం పారదర్శకం కోసమే ఈ ప్రయత్నమని వివరణ ఇస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -