ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్..?

388
Ap Deputy Cm Amjad Basha Test Positive For Coronavirus
Ap Deputy Cm Amjad Basha Test Positive For Coronavirus

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఇక ఇండియాలో కూడా కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రల్లో కరోనా విషయంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి కేసులు తగ్గడం లేదు. ఇక కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు తెలియజేస్తున్నా కొందరు మాస్కులు ధరించకపోవడం.. సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో పాటు ఆయన గన్ మెన్ కు కరోనా పాజిటివ్ నమోదైనట్లు సమాచారం. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ను హొం క్వారంటైన్ లో ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కడపలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్న నేపథ్యంలో సీఎం పర్యటనకు కూడా ఆయనను దూరంగా ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

కరోనా బారిన పడటంతో రేపటి నుంచి 28 రోజుల పాటు గృహ నిర్బందంలో డిప్యూటీ సీఎం ఉండనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజా ప్రతినిధులకు, నేతలకు, పాత్రికేయులకు కరోనా టెస్ట్ లు నిర్వహించారు అధికారులు. ఈ టెస్టుల్లో డిప్యూటీ సీఎం, ఆయన గన్ మెన్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.

సెంటిమెంట్ ను పక్కన పెట్టేసిన జగన్.. కానీ..!

సీఎం జగన్ పై పూరి జగన్నాధ్ ప్రశంసలు..!

కృష్ణ జిల్లాలో ఆ వైసీపీ ఎమ్మెల్యే టాప్ లో ఉన్నాడట..!

సంక్షోభ సమయంలోనూ సంక్షేమానికి పెద్దపీట

Loading...