Saturday, April 27, 2024
- Advertisement -

న్యాయస్థానం విషయంలో చంద్రబాబు కి అంత అవసరమా..

- Advertisement -

చంద్రబాబు రాజకీయంలో చూపించే కుయోక్తుల గురించి అందరికి తెలిసిందే.. ఎలాంటి పరిస్థితి నైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో అయన సిద్ధహస్తుడు.. ఎన్ని కుట్రలు చేసి అయినా ఆ పరిస్థితిని తన కంట్రోల్ లోకి తెచ్చుకుని అందరిని ఆట ఆడించేవారు. కానీ జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం చేసిన వ్యతిరేఖం అయిపోతున్నాయి. అధికారం కోల్పోవడం దగ్గరినుంచి రాజధాని మార్పు వరకు అన్ని జగన్ చెప్పిందే సాగింది.. చంద్రబాబు రాష్ట్రం విషయంలో ఏం చేద్దామని ట్రై చేసినా ప్రజలు తగిన బుద్ధి చెప్తున్నారు..

దీంతో ప్రజలకు దగ్గరయ్యేలా కొన్ని పనులు చేస్తున్నారు చంద్రబాబు.. అవసరం ఉన్నా లేకుండా వారి ని ఆడుకున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు..ఇక ఇప్పుడు న్యాయవ్యవస్థ పై జగన్ చేస్తున్న పోరాటం ప్రజలకు డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.. లేఖ లో ఉన్నదాన్ని కొత్తగా చెప్పి ప్రజలకు జగన్ పై విషాన్ని నూరిపోశే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక ఆ లేఖ రాసిన తర్వాత వారినుండి ఎలాంటి స్పందన రాలేదు.. జగన్, జనం కూడా అత్యున్నత న్యాయస్థానం స్పందన కోసం ఎదురుచూస్తుండగా టీడీపీ మాత్రం ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది.

జగన్ మీద ఆరోపణలున్నాయి కాబట్టి ఆయన ఫిర్యాదు వెనుక ఉద్దేశాలు ఆపాదిస్తున్న టీడీపీ తాను మాత్రం శుద్ధపూసనని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. జగన్ కన్నా ముందు నుంచే చంద్రబాబు అవినీతిపై కోర్టుల్లో కేసులు నానుతున్న విషయాన్ని దాచిపెట్టే యత్నం చేస్తోంది. మరి తనవైపు ఇన్ని బొక్కలు పెట్టుకుని చంద్రబాబు జగన్ పై పడిపోవడం రాష్ట్రం ఏమవుతుందో అని కలవరపడడం ఎందుకని అంటున్నారు.. ఇన్నాళ్లుగా తమ ప్రయోజనాలకు అనుగుణంగా సాగిన వ్యవస్థలో పరిణామాలను మింగుడుపడని నేతల తీరు ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నది వారికి అంతుబట్టినట్టుగా లేదు. ఇలాంటి వ్యవహారాల్లో వీలయినంత వేగంగా సుప్రీంకోర్ట్ స్పందిస్తే రాజకీయ దుమారం కూడా చల్లారుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

అడ్డదారులు వెతుకుతున్న చంద్రబాబు..

చంద్రబాబు వేషాలు తమిళ మీడియా సాక్షిగా తెలిసింది..?

చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?

విమర్శల విషయంలో చంద్రబాబు మితి మీరిపోతున్నాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -