Friday, April 26, 2024
- Advertisement -

టీడీపీ ని తల్లి కొడుకులు పూర్తి గా వదిలేసినట్లేనా..?

- Advertisement -

టీడీపీ పని అయిపొయింది.. దాదాపు అందరు కీలక నేతలు టీడీపీ ని వీడుతున్నారు.. వచ్చే ఎన్నికల నాటికి ఏమవుతుందో తెలీదు కానీ ఇప్పుడు అయితే టీడీపీ లో సరైన లీడర్ లేడనే చెప్పాలి.. చంద్రబాబు, లోకేష్ మినహా టీడీపీ లో ఒక తెలిసిన మొహం అయితే ఏదీ లేదు.. తెలిసిన వీరు కూడా ఇంట్లోనే ఉంటూ ప్రజలకు దూరమవుతున్నారు.. ఇప్పటివరకు తనమీద తీర్చుకున్న పగని జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఇలా పార్టీ కి ఒక్కొక్కరిని దూరం చేస్తూ పార్టీ పునాదులు లేకుండా చేస్తున్నాడని చెప్పొచ్చు.. ఇప్పటికే దాదాపు టీడీపీ లో మెయిన్ మెయిన్ లీడర్లు అందరు దూరమైపోయారు. ద్వితీయ శ్రేణి లీడర్లతో చంద్రబాబు తన పార్టీ ని నడిపించుకోవాలి.. ఇప్పుడు ఉన్న లీడర్లు కూడా వెళ్లిపోయేలా కనిపిస్తున్నారు..

ఇటీవలే గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకున్నారు. ఈమేరకు చంద్రబాబుకి ఆమె లేఖ రాసి తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించేశారు. దాంతో టీడీపీలో కొత్త చర్చ మొదలయ్యింది. ఇప్పటికే ఆమె తనయుడు గల్లా జయదేవ్ టీడీపీ పార్టీ ని వీడుతున్నట్లు వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి.. గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరం గా ఉంటున్నారు. చంద్రబాబు ను సైతం పెద్దగా పట్టించుకోవట్లేదు.. రాజ్యసభ లో చంద్రబాబు ఒకటి చెప్తే తాను మరొకటి చేస్తున్నాడు.. ఈ నేపథ్యంలో అయన తల్లి టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకోవోడం కొంత అనుమానాలకు దారితీస్తుంది..

వాటికి తగ్గట్లుగా  గల్లా అరుణకుమారి భారతీయ జనతా పార్టీలో చేరాలని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా వైసీపీ నేతలకు కొదవ లేదు. అందుకుని వైసీపీ లో చేరినా టీడీపీలో పరిస్థితులే ఉంటాయి. బీజేపీలో చేరితే తానే ప్రధాన నేతగా మారవచ్చన్నది గల్లా అరుణకుమారి భావనగా ఉంది. రాష్ట్రంలో అధికారంలో రాకపోయినా కేంద్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి వ్యాపార కార్యక్రమాలకు ఇబ్బంది ఉండదన్న ఆలోచనలో గల్లా అరుణకుమారి ఉన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు వేషాలు తమిళ మీడియా సాక్షిగా తెలిసింది..?

రాజు గారు ఇప్పుడెలా మరీ…!

చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?

జంపింగ్ జపాంగ్‌లను పక్కన పెట్టిన బాబు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -