Wednesday, May 8, 2024
- Advertisement -

వైకాపాలోకి గంటా…… సీనియర్ నేత ద్వారా జగన్‌తో రాయబారం నడుపుతున్నాడా?

- Advertisement -

2019 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయి ఉన్న నేతలు వ్యూహరచన చేస్తూ ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఉప ముఖ్యమంత్రి ఆశ చూపించి గంటా శ్రీనివాసరావును టిడిపిలో చేర్చుకున్నాడు చంద్రబాబు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ హామీల విషయంలో ఓటేసిన ప్రజలకు హ్యండ్ ఇచ్చినట్టుగానే గంటాకు కూడా హ్యాండ్ ఇచ్చాడు. ఎప్పటికైనా జనసేనలోకి చేరతాడని, మెగా ఫ్యామిలీకి జై కొడతాడని, అస్సలు నమ్మదగ్గనేత కాదని టిడిపి సీినియర్ నేతల దగ్గర గంటా గురించి వ్యాఖ్యానించాడు చంద్రబాబు. అలాగే అయ్యన్నపాత్రుడులాంటి నేతల చేత గంటా శ్రీనివాసరావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయించాడు.

అందుకే చంద్రబాబు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు గంటా. ఈ మధ్యలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చేత సర్వే చేయించి గంటా శ్రీనివాసరావు ఓడిపోతాడన్న ప్రచారానికి కూడా తెరలేపాడు బాబు. ఈ నేపథ్యంలో జనసేన ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చిన గంటా వైకాపాలో చేరడానికి పావులు కదుపుతున్నాడు. వైఎస్ జగన్‌కి సన్నిహితుడైన ఒక టీఆర్ఎస్ నాయకుడి ద్వారా రాయబారం నడుపుతున్నాడు. గంటాకు మద్దతుగా నిలిచే ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి తీసుకొస్తానని ఆఫర్ ఇస్తున్నాడు గంటా. అయితే గంటా చేరిక విషయంలో విజయసాయిరెడ్డి అంత సంతృప్తిగా లేడని జగన్ సన్నిహితులు చెప్తున్నారు. గంటా శ్రీనివాసరావుకు దగ్గర బంధువైన మంత్రి నారాయణ కాలేజీ ఫీజుల గురించి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ గంటాను పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లో చెడు సంకేతాలు వెళతాయని విజయసాయి అభిప్రాయపడుతున్నాడు. అన్నింటికీ మించి 2019 ఎన్నికల్లో పోటీ పోటీగా సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే గంటా శ్రీనివాసరావును అస్సలు నమ్మలేం అని విజయసాయి విశ్లేషిస్తున్నాడు. ప్రస్తుతం ఇదే విషయాలపై వైకాపాలో చర్చ జరుగుతోంది. గంటా శ్రీనివాసరావు వైకాపాలో చేరతానని ఇచ్చిన ఆఫర్ విషయంలో జగన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -