Friday, April 26, 2024
- Advertisement -

అమరావతి పై కొడాలినాని ఇలా అన్నాడేంటి..!!

- Advertisement -

అమరావతి లో చంద్రబాబు నెలకొల్పిన రాజధానిని జగన్ విశాఖ కు తరలించిన సంగతి తెలిసిందే.. అయితే రాజధాని ని ఎక్కడికి తరలించవద్దని అక్కడి రైతులు ధర్నాలు చేపట్టారు.. దాదాపు సంవత్సరం కావొస్తున్నా ఈ ఉద్యమం ని పట్టువిడవకుండా ప్రజలు చేస్తూనే ఉన్నా జగన్ ఎలాంటి కనికరం చూపించడంలేదు.. జగన్ అమరావతి ని శాసన రాజధానిగా, విశాఖ ని పరిపాలన రాజధాని గా, కర్నూర్ లో హై కోర్టు ని ఏర్పాటు చేసి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా నిర్ణయం తీసుకున్నారు..

అయితే దీనిపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎం జగన్‌కు తాను చెప్పానని, దీనిపై అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ తనతో చెప్పారని అన్నారు.

అమరావతిలో 55 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే దానిపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. అటు తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ వెంటే నడుస్తానని కొడాలి నాని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -