Friday, April 26, 2024
- Advertisement -

జగన్ కమిట్మెంట్ చూసి షాక్ అయ్యా.. కానీ మోసం : రఘురామ

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల అంశం అధికారికం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి అంశంపై రెఫరెండం నిర్వహించాలని.. వైసీపీ ప్రజాప్రతినిధులకు రహస్య ఓటింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ అమరావతి విషయంలో ప్రజలను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు.

జగన్ తీసుకునే నిర్ణయాలు అప్పట్లో ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఉండేవని.. ఆయన అమరావతిలో పార్టీ ఆఫీసుతో పాటు ఇల్లు కూడా కట్టుకోవడంతో ఆయన్ను ప్రజలు నమ్మారని తెలిపారు. “అమరావతికి నేను వ్యతిరేకం అని ప్రజలు అనుకున్నారు. కానీ నేను అమరావతికి అసలు వ్యతిరేకం కాదు. ఆ చంద్రబాబుకు ఇక్కడ ఇల్లు ఉందా ? ఏముంది ? అంటూ నాడు జగన్ నమ్మబలికారు. ఆ టైంలో నేను వైసీపీలో లేకపోయినా.. జగన్ కమిట్మెంట్ చూసి ఎంతో షాక్ అయ్యాను. ప్రజలు కూడా ఎంతో సంతోషించారు.

చంద్రబాబు సైతం ఇల్లు కట్టుకోని చోట జగన్ ఇల్లు కట్టుకున్నాడని ప్రజలు గుడ్డిగా నమ్మారు. కానీ ఇప్పుడు ప్రజలను జగన్ మోసం చేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు దక్షిణాఫ్రికాను చూసి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అసలే మనది విభజించిన తర్వాత చిన్నరాష్ట్రం అయింది. దానికి మూడు రాజధానులు ఎందుకు? న్యాయవ్యవస్థలు ఏర్పాటు చేసినంత మాత్రాన కర్నూలు రాజధానిగా అభివృద్ధి జరుగుతుందా?” అంటూ ఆయన కామెంట్స్ చేశారు.

విజయసాయిరెడ్డికి గంటా ఇలా షాక్ ఇవ్వనున్నాడా ?

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : కరోనా విషయంలో జగన్ షాకింగ్ నిర్ణయం..!

విజయసాయి రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పనున్న జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -