Friday, April 19, 2024
- Advertisement -

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..!

- Advertisement -

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యం ఉన్న వాళ్లకు కొలువులు చేంతకే చేరేలా చేస్తోంది. ఇంజినీరింగ్, డిగ్రీలలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక నైపుణ్యం కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు పొందేలా చేస్తోంది. ఇ లెర్న్ ఇండియా అనే సంస్థ సహాయ సహకారాలతో డిజిటల్ తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

డేటా సైన్స్, డెవలప్ సైన్స్, ఐఇఎల్‍టీఎస్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు లకు 90 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. పబ్లిక్ కమ్యూనికేషన్ ఆన్ లైన్ సేఫ్టీ ఫేస్బుక్ జాబ్స్ డిజిటల్ మార్కెటింగ్ సైబర్ సెక్యూరిటీ వెబ్ డెవలపర్ డిజిటల్ ఫౌండేషన్ ఇతర కోర్సులకు సంబంధించి డిజిటల్ నైపుణ్యాలకు సంబంధించిన శిక్షణను కూడా ఇవ్వనుంది. విద్యార్థులు ఎంచుకున్న కోర్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే ఆన్లైన్ కోర్సు లకు హాజరుకావాల్సి ఉంటుంది.

ప్రతిభ చూపిన వాళ్లకూ ప్రభుత్వం సర్టిఫికెట్లను ఇస్తోంది. విద్యార్ధి సర్టిఫికెట్ పొందిన తర్వాత ఆసక్తి ఉంటే ఇతర కోర్సులకు కూడా హాజరు కావచ్చు. విద్యార్థుల సమార్ద్యంను బట్టి అధికారులు శిక్షణ కూడా ఇస్తారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వాళ్లకు సులభంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ కోర్సులో చేరాలనుకునే వాళ్ళు www.apssdc.in వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా సందేహాలు ఉంటే 1800-425-2422 నెంబర్ కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.

జగన్ సర్కార్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలని ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ప్రయోజనం చేకూరుస్తుంది. కరోనా విజృంభన నేపథ్యంలో ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయిన సంగతి తెలిసిందే. ఈ కోర్సులు పూర్తి చేసిన వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా ఉందని సమాచారం.

విజయసాయిరెడ్డికి గంటా ఇలా షాక్ ఇవ్వనున్నాడా ?

విజయసాయి రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పనున్న జగన్..!

జగన్ మా మాట వినరు.. చెప్పుడు మాటలు వింటారు : రఘు రామకృష్ణరాజు

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : కరోనా విషయంలో జగన్ షాకింగ్ నిర్ణయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -