Saturday, April 27, 2024
- Advertisement -

సోము వీర్రాజు టీడీపీ బీజేపీ లీడర్లను టార్గెట్ చేశారా…?

- Advertisement -

చంద్రబాబు రాజకీయ తంత్రం గురించి అందరికి తెలిసిందే.. ఉన్న చోటే ఉండి రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించగల వ్యక్తి చంద్రబాబు నాయుడు.. ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయి కొంత ఢీలా పడిపోయాడే గానీ తనదైన టైం లో రాజకీయాల్లో ఎంత చక్రం తిప్పగలిగాడో అంత చక్రం తిప్పేశాడు.. సీనియర్ నాయకులను సైతం మైమరిపించే వ్యూహాలు వేశాడు చంద్రబాబు.. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే తమ నేతలను కొంతమంది బీజేపీ లోకి పంపాడు చంద్రబాబు.. కొన్ని రాజకీయ ప్రయోజనాల మేర ఇబ్బందులు తలెత్తుతాయని ముందే ఊహించి వారిని బీజేపీ లోకి పంపి కొంత సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశారు..

అయితే వారు అక్కడికి వెళ్ళాక వారు ఆడిందే ఆట, పాడిందే పాట అనుకున్నారు.. వాస్తవానికి పరిస్థితి కూడా అలానే తయారైంది. బీజేపీ లో అప్పటివరకు సరైన నాయకత్వం లేకపోవడం, గట్టి నాయకుడు లేకపోవడంతో వలసవెళ్లిన నాయకులదే పెత్తనం అనుకున్నారు.. కానీ ఎప్పుడైతే సోము వీర్రాజు లైన్ లోకి వచ్చాడో వీరి ఆటలు అంతగా సాగడం లేదని చెప్పాలి.. జాతీయ కార్యవర్గంలో టీడీపీ నుంచి వెళ్ళిన నేతలకు కీలకపదవులు వచ్చేస్తాయని, తద్వారా మళ్ళీ ఏపీలో చక్రం తిప్పేస్తారంటూ ఊహాగానాలు ఇటీవలి కాలంలో మరీ ఎక్కువయ్యాయి. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేస్తూ పుకార్లకు భిన్నంగా బీజేపీ నాయకత్వం వ్యవహరించింది. అప్పటికప్పుడు తమ బ్రతుకుదెరువు కోసం వచ్చి పార్టీ కండువాలు కప్పుకున్ననాయకులను పూర్తిగా పక్కన పెట్టేసి, పార్టీకోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారికి మాత్రమే కేంద్ర కార్యవర్గాలో ప్రాధాన్యమిచ్చింది.

2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓటమి తర్వాత దురాలోచనలతో బీజేపీ లోకి వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయించి చూస్తున్నారని వైసీపీ పార్టీ ఓ వైపు చెప్తున్నా వినకుండా బీజేపీ పార్టీ వారిని చేర్చుకుని పూర్తిగా మునుగక ముందే కళ్ళు తెరచి వారిని దూరం పెట్టడం మంచిదని పార్టీ క్యాడర్ భావిస్తుంది. బీజేపీలో చేరిన వలస నాయకుల పరిస్థితే ఇప్పుడేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ్నుంచి అక్కడకెళ్ళి, అక్కడి నుంచి ఇక్కడ స్టీరింగ్‌ తిప్పేద్దామనే బహుదూరపు వ్యూహంతో వెళ్ళిన వాళ్ళంతా ఎటువంటి కీలక పదవులు దక్కకుండా ఉండిపోవాల్సి రావడం నిజంగా వారి వైపు నుంచి తీవ్ర ఇబ్బందికర పరిస్థితేనని చెబుతున్నారు.

సోము వీర్రాజు వ్యూహం ప్రజలు అంగీకరించేనా…?

సోము వీర్రాజు భలే ప్లాన్ వేశాడే..?

మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!

అచ్చెన్నా కి అంత దమ్ముందా.. దిగజారిపోయిన పార్టీ ని…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -