Saturday, April 27, 2024
- Advertisement -

సొంత గూటికి టీడీపీ మాజీ మ‌హిళా మంత్రి….

- Advertisement -

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అక్కుర్లేదు. టీడీపీ హ‌యాంలో మంత్రిగా ఉన్న స‌మ‌యంలో సొం ఇమేజ్‌ని సంపాదించుకుంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే క‌ర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సుదీర్ఘ‌మైన రాజ‌కీయ చ‌రిత్ర ఉంది. వైసీపీ నుంచి భూమా దంప‌తులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కాని దుర‌ధృష్ట‌వ శాత్తు శోభానాగిరెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆత‌ర్వాత ఆళ్ల‌గ‌డ్డ నుంచి త‌న త‌ల్లి స్థానంనుంచి భూమా అఖిల‌ప్రియ ఎమ్మెల్యే అయ్యారు.

కొన్ని రాజ‌కీయ ప‌రిణామాల మ‌ధ్య భూమా ఫ్యామిలీ ఆప‌రేష‌ణ్ ఆక‌ర్ష‌లో భాగంగా టీడీపీలోకి జంప్ అయ్యారు. భూమా నాగిరెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పిన బాబు త‌ర్వాత ప‌ట్టించుకోలేదు. అనూహ్యంగా నాగిరెడ్డి గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఇలాంటి స‌మ‌యంలో మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌న్న విమ‌ర్శ‌లు రాకుండా అఖిల‌ను త‌న కేబినేట్‌లో ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా అవ‌కాశం క‌ల్పించారు.

భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఖాలీ అయిన నంద్యాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను అటు బాబు ఇటు జ‌గ‌న్ ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకున్నారు.టీడీపీనుంచి త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని శిల్పా మోహ‌న్ రెడ్డి వైసీపీలో వ‌చ్చి టికెట్ ద‌క్కించుకున్నారు. ఇక టీడీపీ నుంచి అఖిల ప్రియ అన్న భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి పోటీలో నిల‌బ‌డ్డారు. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో అఖిల జ‌గ‌న్ పై చేసిన విమ‌ర్శ‌లు అన్ని ఇన్నీ కావు. జ‌గ‌న్ కూడా అక్క‌డే మాకాం వేసి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. అయితే భూమా సెంటీ మెంట్ కార‌ణంగా అనూహ్యంగా టీడీపీ అభ్య‌ర్థి బ్ర‌హ్మానంద‌రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. దాంతో జిల్లా అంతా అఖిల ప్రియ పేరు మారుమ్రోగింది.

ఈ ఎన్నిక‌ల త‌ర్వాత‌నె అస‌లు క‌థ స్టార్ట్ అయ్యింది. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో అమాంతం పెరిగిన అఖిల ఇమేజ్ ప‌డిపోవ‌డం ప్రారంభించింది. ఇదంతా అఖిల చేసుక‌న్న పుణ్య‌మే. మంత్రిగా హోదాలో జిల్లాలో సీనియ‌ర్ నాయ‌కుల‌ను లెక్క చేక‌పోడం బాబు మీటింగ్‌ల‌ను అటెండ్ కాక‌పోవ‌డంలాంటి చ‌ర్య‌ల‌తో అఖిల ఇమేజ్ దిగ‌జారింది. ప్ర‌భుత్వ‌, పార్టీ కార్య‌క్ర‌మాల్లో సీనియ‌ర్ల‌ను పిల‌వ‌కుండా వారిని ఘోరంగా అవ‌మానించింది. అప్ప‌టినుంచి అఖిల‌పై పూర్తి వ్య‌తిరేక‌త ప్రారంభం అయ్యింది.

తండ్రి భూమా నాగిరెడ్డికి అత్యంత స‌న్నిహొతుడైన ఏవీ సుబ్బారెడ్డి కుంటుంతో విబేధాలు మొద‌ల‌య్యాయి. ఆ విభేధాలు త‌రాస్థాయికి చేరాయి. ఒకా నొక ద‌శ‌లో అఖిల‌కు మ‌రో సారి టికెట్ ఇస్తే ఓడించి తీరుతాన‌ని వార్నింగ్ ఇచ్చిన సుబ్బారెడ్డిని బాబు బుజ్జ‌గించారు. అంతేకాదు ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న నాయ‌కులు వైసీపీలో జాయిన్ అయ్యారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో భూమా అఖిల ప్రియ గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఓటిమికి కార‌ణం అహంకారంతో అఖిల చేసుకున్న త‌ప్పిదాలే. సుబ్బారెడ్డితో విభేదాలు, సీనీయ‌ర్ నాయ‌కులు వైసీపీలో చేర‌డం లాంటి ఘ‌ట‌న‌లు అఖిల విజ‌యాన్ని దెబ్బ‌తీశాయి. ఇక నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ కీ మ‌ద్ద‌తు తెలిపిన ప్ర‌భాకర్ రెడ్డి సోద‌రుడు ప్ర‌తాప్ రెడ్డి కూడా వైసీపీకీ మద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో వైసీపీ సునాయాసంగా విజ‌యం సాధించింది.

సీన్ క‌ట్ చేస్తే ఇప్పుడు అఖిల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవ‌డంతె ఆమె రాజ‌కీయ భ‌విష్య‌త్తు అంధ‌కారంలో పడింది. ఈ స‌మ‌యంలో మ‌ళ్లీ సొంత గూటికి వ‌చ్చేందుకు సిద్దం అయ్యింది. మ‌రో వైపు జ‌గ‌న్ తో త‌న‌కు ఎటువంటి విబేధాలు లేద‌ని ఇటీవ‌ల అఖిల చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. మ‌రో వైపు వైఎస్ విజ‌య‌మ్మ‌తో ఉన్న చ‌నువు కార‌ణంగా తిరిగి వైసీపీలో వెల్తుంద‌నే వార్త‌ల‌పై జిల్లా వ్యాప్తంగా చ‌ర్చించుకుంటున్నారు.

మ‌రో వైపు ఎన్నిక‌ల‌కు ముందు అఖిల మేన‌మామ మోహ‌న్ రెడ్డి వైసీపీగూటికి చేరిన సంగ‌తి తెలిసిందే. దీంతో అఖిల ఆలోచ‌న‌లో మార్పు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ మారుత‌న్న వార్త‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు అఖిల ఖండిచ‌క‌పోవ‌డం మ‌రింత బ‌లాన్ని చేకూర్చుతోంది. జ‌గ‌న్ కూడా అడ్డు చెప్ప‌ర‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని స‌ర్వ‌త్రా అస‌క్తి నెల‌కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -