Saturday, April 27, 2024
- Advertisement -

కోరి మరీ కమెడియన్ అవుతావేం లోకేష్ః తమ్ముళ్ళ ఎటాక్

- Advertisement -

పాలిటిక్స్‌లో బ్రహ్మానందం రేంజ్ కామెడీని పండించడం ఎలా? కామెడీ చేసి పొలిటికల్ బఫూన్ అయిపోవడం ఎలా అనే విషయాల్లో థీసిస్ చేసి మరీ కామెడీ అయిపోతున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఎవరో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఎన్నోసార్లు ఆయన చేసిన కామెడీని ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేశారు మరి. అంత ఈజీగా ఎలా మర్చిపోగలరు. సదరు నాయకుడు ఇప్పుడు మరోసారి టాప్ క్లాస్ కామెడీ పండించారు.

అప్పుడెప్పుడో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో చిరంజీవి తర్వాత అంతటి ముఖ్యుడు, సీట్ల అమ్మకాల్లో కోట్లు సంపాదించాడు అని పేరు తెచ్చుకున్న అల్లు అరవింద్‌ చేసిన కామెడీ గుర్తుందా? 2009 ఎన్నికల్లో చంద్రబాబు, వైఎస్‌లు పోటీ చేస్తున్న సీట్లలో తప్ప అన్ని సీట్లలోనూ గెలిచేస్తామని ప్రగల్భాలు పలికాడు. ఫలితాలు మాత్రం మెగాస్టార్, పవర్ స్టార్‌లాంటి స్టార్స్‌తో పాటు సదరు అరవింద్ కూడా బొక్కాబోర్లాపడేలా వచ్చాయి. ఇప్పుడు మన కామెడీ పొలిటీషియన్ నారా లోకేష్ కూడా అంతకుమించి కామెడీ చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని సీట్లలోనూ టిడిపినే గెలుస్తుందని చెప్పుకొచ్చాడు. 175సీట్లలోనూ తెదేపానే గెలుస్తుందని చెప్పారు. ఆ మధ్య ఎమ్మెల్యే సీట్లు ఎన్నో కూడా తెలియకుండా ఆ సంఖ్యను తప్పుచెప్పి కామెడీ అయిపోయారు లోకేష్. ఇప్పుడేమో పులివెందులతో సహా మొత్తం 175 సీట్లలోనూ తెదేపా గెలిచేస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం లోకేష్ చెప్పింది కరెక్టే అని కాకపోతే టిడిపి 175 సీట్లలో గెలిచేయడం కాదు చంద్రబాబుతో సహా లోకేష్‌ని ఇతర టిడిపి నాయకులను, పచ్చ మీడియాను అన్ని సీట్లలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గేలిచేస్తున్నారన్న సెటైర్స్ పడుతున్నాయి. కామెడీ పొలిటీషియన్‌ని అని మరోసారి లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడని సెటైర్స్ వేస్తున్నారు. ఇక తెలుగు తమ్ముళ్ళు, టిడిపి నాయకులు అయితే కోరి మరీ కామెడీగా మాట్లాడి కమెడియన్ అయిపోవడం లోకేష్‌కి అవసరమా అని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ నాయకత్వం దెబ్బకు విదేశీయులు, పారిశ్రామికవేత్తలు కూడా ఆశ్ఛర్యపోతున్నారు, షాక్ అవుతున్నారు అంటూ తోక మీడియా, నంబర్ ఒన్ మీడియా సంస్థలు ఎంతలా జాకీలేసి లేపాలని చూస్తున్నా కూడా లోకేష్‌ మాత్రం ఎప్పటికప్పుడు తన కామెడీ టాలెంట్‌తో అసలు పస అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఆయా పచ్చ మీడియా సంస్థల పరువు తీస్తున్నాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -