Friday, April 26, 2024
- Advertisement -

ద‌ర్శినియోజ‌క వ‌ర్గం అభ్య‌ర్ధిని ఖ‌రారు చేసిన వైసీపీ

- Advertisement -

అభ్య‌ర్ధుల‌ ఎంపిక విష‌యంలో జ‌గ‌న్ దూకుడు పెంచారు. అధికార పార్టీ టీడీపీకీ షాక్ ఇచ్చే విధంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఈనెల 9న ఇచ్చాపురంలో జ‌రిగే భారీ బ‌హిరంగ స‌భ‌లో పార్టీ త‌రుపున అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌నున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే పాద‌యాత్ర‌లో కొంత‌మందికి టికెట్ల‌ను క‌న్ఫ‌మ్ చేశారు జ‌గ‌న్‌. తాజాగా ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క వ‌ర్గ నుంచి ఎవ‌రు పోటీ చేస్తార‌నే విష‌యంలో జ‌గ‌న్ క్లారిటీ ఇచ్చారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేసేందుకు సిద్ద‌మ‌ని ప్ర‌ముఖ పారీ శ్రామిక వేత్త మ‌దిశెట్టి వేణుగోపాల్ స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం పార్టీ అధినేత జ‌గ‌న్‌ను లోట‌స్ పాండ్‌లో క‌ల‌సి త‌న నిర్ణ‌యాన్ని సూచ‌న ప్రాయంగా వెల్ల‌డించారంట‌. దీంతో జ‌గ‌న్ కూడా ఆయ‌న ప‌చ్చ జెండా ఊపారంట‌. వెంటనే రంగంలోకి రావాలని జగన్‌ ఆయనకు సూచించగా సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాలను ప్రారంభిస్తానని వేణుగోపాల్‌ బదులిచ్చినట్లు సమాచారం.

వివిధ కారణాలతో దర్శి నియోజకవర్గ వైసీపీ సమ న్వయకర్త పదవి కొన్ని నెలల నుంచి ఖాళీగా ఉంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున దర్శి నుంచి పోటీ చేసిన వేణుగోపాల్‌ అంగీకరిస్తే ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించాలని నెల క్రితమే నిర్ణ‌యించుకున్న జ‌గ‌న్… ఈ విష‌యాన్ని బాలినేని ద్వారా వేణ‌గోపాల్‌కు చేర‌వేశారంట‌. దీంతో శుక్రవారం తన సోదరుడు, ఒంగోలులోని పేస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నిర్వాహకుడు శ్రీధర్‌తో కలిసి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు వెళ్లారు. తొలుత సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయిన ఆయన ఆతర్వాత జగన్‌ను కలిశారు. సంక్రాంతి త‌ర్వాత ఎన్నిక‌ల రంగంలోకి దిగ‌తాన‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం.

జగన్‌తో వేణుగోపాల్‌ భేటీ పార్టీపరంగా కీలక పరిణామంగా భావిస్తుండగా ఆ సమయంలో జిల్లా కు చెందిన ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డికానీ, మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డికానీ ఆ సమయంలో అక్కడ లేకపోడం చర్చనీయాంశమైంది. అయితే వేణుగాపాల్ అభ్య‌ర్తిత్వంపై బాదం మాధవరెడ్డి, బూచేప‌ల్లి ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది అస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -