Saturday, April 27, 2024
- Advertisement -

నెల్లూరులో వైసీపీకీ బిగ్‌షాక్‌…సీనియ‌ర్‌నేత పార్టీకి రాజీనామా

- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తాద‌ని స‌ర్వేలు ఘోషిస్తుంటే..పార్టీనుంచి నాయ‌కులు బ‌య‌ట‌కు వెల్లిపోతున్నారు. జ‌గ‌న్ చేస్తున్న పాద‌య‌త్ర‌కు అనూహ్య‌స్పంద‌న వ‌స్తుంటే మ‌రో వైపు పార్టీలో చేరిక‌ల‌తో పాటు రాజీనామాలు కొన‌సాగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో వైసీపీకీ బిగ్‌షాక్ త‌గిలింది.

అనం రామ‌నారాయ‌ణ రెడ్డి పార్టీలో చేరిన వెంట‌నే పార్టీలో అస‌మ్మ‌తి రాసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పార్టీతో పాటు జెడ్పీ చైర్మన్ పదవికి ఈ రోజు రాజీనామా చేశారు. వైసీపీలో గతకొంత కాలంగా చురుగ్గా ఉన్న బొమ్మిరెడ్డి వెంకటగిరి అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున్నారు. కానీ ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిని పార్టీ అధిష్ఠానం తాజాగా వెంకటగిరి ఎన్నికల ఇన్ చార్జీగా నియమించడంతో ఆయన మనస్తాపానికి లోనయ్యారు. రాజీనామా సందర్భంగా బొమ్మిరెడ్డి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధినేత వైఖరి నచ్చని కారణంగా పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో పోటీకి రూ.50 కోట్లు కావాలని, అంత డబ్బు నువ్వు ఖర్చుపెట్టగలవా అని వైఎస్ జగన్ తనను ప్రశ్నించినట్లు బొమ్మిరెడ్డి వివరించారు. త్వ‌ర‌లోనే భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -