Monday, April 29, 2024
- Advertisement -

వైసీపీలో క్రాస్ ఓటింగ్.. ఎవరి తప్పిదం..?

- Advertisement -

మొన్న జరిగిన ఏపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అంతే కాదు వైసీపీ అధిష్టానం త్వరగానే రియాక్ట్ అయింది. ఈ రియాక్షన్ ఇరత అసంతృప్తి ఎమ్మెల్యేలకు కూడా భయం కలిగేలా.. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వైసిపి పార్టీ వేటు వేసింది. ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు నలుగురు వైసిపి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

అంతే కాదు నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు గుర్తించామని… ఒక్కొక్క ఎమ్మెల్యేకు టిడిపి అధినేత చంద్రబాబు రూ.15 కోట్ల నుంచి రూ.20కోట్లు ఇచ్చారని.. క్రాస్ ఓటింగ్ పై అంతర్గతంగా విచారణ చేసిన తర్వాత వారిపై చర్యలు తీసుకున్నామని… వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సజ్జల ఆరోపించారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల రియాక్ష పక్కన పెడితే.

ఎందుకు క్రాస్ ఓటింగ్ జరిగింది..? ఈ తప్పిదం ఎవరిది…? అనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరుగా జరుగుతుంది. మరికొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రాస్ ఓటింగ్ వైసీపీ అధిష్టానం పై వ్యతిరేకతా..? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైఫల్యం మా..? సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలలో ముగ్గురు ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలే.. వీరి విమర్శలు కూడా సజ్జల ను టార్గెట్ చేస్తున్నాటు ఉన్నాయి. మరో పక్క శ్రీదేవి కూడా సజ్జల పై ఘాటుగా విమర్శించారు. ఇక్కడ వీరి వ్యతిరేకత అధిష్టానం పైనా..? సజ్జల రామకృష్ణారెడ్డి పైనా?….. ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా విఫలమైనట్లు అర్థమౌతుంది. ఇప్పటికైనా అధిష్టానం మేలుకోకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో షాక్ తప్పదన్నట్టు వైసీపీలో చర్చ జోరు గా జరుగుతున్నాటు సమాచారం.

-Ramesh Reddy Chilakala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -