Friday, April 26, 2024
- Advertisement -

కెసీఆర్ ఫస్ట్ భారీ రిటన్ గిఫ్ట్…. జగన్‌కి బిగ్గెస్ట్ బూస్ట్ ఇచ్చేశాడుగా…

- Advertisement -

తెలంగాణాకు వచ్చి చంద్రబాబు నాకు గిఫ్ట్ ఇచ్చాడు కదా…… నేను కూడా ఆంధ్రాకు వెళ్ళి చంద్రబాబుకు రిటన్ గిఫ్ట్ ఇస్తాను అన్న కేసీఆర్ మొదటి గిఫ్ట్ ఇచ్చేశాడు…… అది కూడా బాబుకు దిమ్మతిరిగే రేంజ్‌లో…. జగన్‌కి బిగ్గెస్ట్ బూస్ట్ అయ్యే స్థాయి గిఫ్ట్ ఇచ్చాడు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌ని ఎదుర్కోవాలంటే ఇప్పటికిప్పుడు చాలా చాలా కొత్త అస్త్రాలను తయారుచేసుకోవాల్సిన పరిస్థితికి నెట్టేశాడు. కొత్తగా ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతిలాంటి మీడియా సంస్థలు, రాధాకృష్ణ, రామోజీరావులాంటి భజన జర్నలిస్టులను, లగడపాటి రాజగోపాల్ లాంటి సర్వే డ్రామాల స్పెషలిస్టులను తయారు చేసుకోవడం అంటే ఇప్పటికిప్పుడు చంద్రబాబుతో అయ్యే పనేనా?

చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చిన బిగ్గెస్ట్ రిటన్ గిఫ్ట్ ఇదే. మీడియాను అడ్డుపెట్టుకుని బాబు ఆడే డ్రామాలను గుడ్డలూడదీసి జనాలకు కళ్ళకు కట్టినట్టు చూపించాడు. సమాజం కోసం పనిచేస్తున్నాం అని చెప్తూ బాబు భజన కోసమే పనిచేస్తూ తెలుగు నాట జర్నలిజాన్ని వ్యభిచారం కంటే దిగువ స్థాయికి తీసుకెళ్ళిన ఎల్లో మీడియా సంస్థలు, వాటి అధినేతల అసలు రంగులను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. విజయ్ మాల్యాను, డబ్బున్న పెద్దలను మోడీ కాపాడుతున్నాడు అని నీతులు చెప్పే బాబు……ఎన్నికల్లో గెలవడం కోసం లగడపాటి లాంటి వేల కోట్లు అప్పులు ఎగవేసిన బాపతు జనాలతో ఎలాంటి సర్వే రాజకీయాలు చేస్తాడో తెలుగు ప్రజలందరికీ తెలిసేలా చేశాడు. బాబు డబ్బు రాజకీయాలు, అలాగే అన్నీ నేనే చేశా అని చెప్పుకునే ఉత్తరకుమార ప్రగల్భాల వ్యవహారాలన్నింటినీ బట్టబయలు చేశాడు. మొత్తంగా చూస్తే ఆల్రెడీ పాతాళంలో ఉన్న చంద్రబాబు, ఆయన భజన మీడియా సంస్థల విశ్వసనీయతను పూర్తిగా దెబ్బకొట్టాడు కేసీఆర్.

ఇక 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు కానీ, ఆయన మీడియా సంస్థలు కానీ, బాబు కోసం తెరపైకి వచ్చే లగడపాటి లాంటి జనాలు కానీ ఏం చెప్పినా ఆంధ్రప్రదేశ్ జనాలు నమ్మరు అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరమూ లేదు. ఈ విషయంలో తెలంగాణా ప్రజలు చూపించిన విజ్ఙత ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపిస్తే మాత్రం చంద్రబాబుకు ప్రతిపక్ష స్థానం కూడా దక్కదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుకు దిమ్మతిరిగే స్థాయిలో, పచ్చ బ్యాచ్ మొత్తానికి పిచ్చి టెన్షన్ పెట్టే స్థాయిలో కేసీఆర్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇదే అన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -