Friday, April 26, 2024
- Advertisement -

స‌రికొత్త రైలును ఆవిస్క‌రించిన ఇడియ‌న్ రైల్వే

- Advertisement -

ఎన్‌డీఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రైల్వే వ్య‌వ‌స్థ‌లో మార్పుల‌కు శ్రీకారం చుట్టింది.కొత్త రైల్ల‌ను ప్ర‌వేశ పెట్ట‌డంతోపాటు ప్రాయానీకుల సౌక‌ర్యాల‌కు పెద్ద‌పీట వేసింది.పెరిగిపోతున్న కాలుష్యం,అధిక ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవ‌డానికి నూత‌న ప‌ద్ద‌తుల‌ను అవ‌లంభిస్తోంది.తాజాగా స‌రికొత్త రైల‌ను తీసుకొచ్చింది ఇండియ‌న్‌ రైల్వే.

మోదీ మేకిన్ ఇండియాలో భాగంగా ప్ర‌పంచంలోనె మొట్ట‌మొద‌ట‌సారిగా సోలార్‌తో న‌డిచే రైల‌ను ఆవిస్క‌రించారు.శుక్రవారం భారతీయ రైల్వే పర్యావరణ హిత రైలును ప్రారంభించింది. సూర్యరశ్మి (సోలార్) ఆధారంగా నడిచే ఈ రైలులో ఎలక్ట్రికల్, డీజిల్ సదుపాయం కూడా ఉంది. రైలుపై మొత్తం 16 సోలార్ ప్యానెళ్లు అమర్చారు. దేశంలో ఇదే తొలి సోలార్ పవర్ రైలు. ఢిల్లీలోని సరై రోహిల్లా- హరియాణాలోని ఫరూఖ్ నగర్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది.

ఈ రైలును నిర్మించ‌డానికి రూ.54 లక్షలు ఖర్చయింది. రైళ్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చడం ప్రపంచంలోనే ఇది తొలిసారి.త్వ‌ర‌లో దూర ప్ర‌యాణాల రైళ్లను కూడా సౌర‌శ‌క్తితో న‌డిచేలా చేస్తామ‌ని, ఇలా చేయ‌డం ద్వారా భారతీయ రైల్వేకి సంవ‌త్స‌రానికి రూ. 700 కోట్ల ఇంధ‌న ఖ‌ర్చు త‌గ్గుతుంద‌ని భార‌తీయ రైల్వే ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న సంస్థ సీఈఓ ర‌వీంద‌ర్ గుప్త తెలిపారు. ఒక్క సారైనా ఆరైలును ఎక్కాల‌ని ఆశ ఎవ‌రికి ఉండ‌దు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -