Friday, April 26, 2024
- Advertisement -

దిల్ రాజు పరిచయం చేసిన డైరెక్టర్స్ వీరే..!

- Advertisement -

శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు దిల్ రాజు. కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి స్టార్ డైరెక్టర్స్ ని చేశాడు. వారెవ్వరో ఇప్పుడు చూద్దాం.

సుకుమార్ : ఇతని స్వస్థలం మట్టపాడు, తూర్పు గోదావరి జిల్లా. దర్శకుడు కాక ముందు గణితం భోధించే అధ్యాపకులు. ఇతని మొదటి చిత్రం ఆర్య సంచలన విజయం సాధించింది. ఆర్య నిర్మించింది దిల్ రాజే.

బోయపాటి శ్రీను : ఇతని మొదటి సినిమా భద్ర సినిమాకి నిర్మాత దిల్ రాజు. ఆ తర్వాత తులసి, సింహ, దమ్ము, లేజండ్, సరైనోడు సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

వి వి వినాయక్ : వి వి వినాయక్ తెలుగు సినీ అగ్ర దర్శకుడు, యాక్షన్ సినిమాలు తీయటం లో ఆరితేరిన దర్శకుడు. ఈయనను కూడ సినీ పరిశ్రమకు ఆది సినిమాతో దిల్ రాజు పరిచయం చేసారు.

వంశీ పైడిపల్లి : వంశీ పైడిపల్లి టాలీవుడ్ చిత్ర దర్శకుడు, బృందావనం (2010), యెవాడు (2014) & ఉపిరి (2016) చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉపిరి చిత్రానికి తెలుగు – ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఇతని మొదటి సినిమా మున్నా ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు

భాస్కర్ : బొమ్మరిల్లు భాస్కర్ గా ప్రసిద్ది చెందిన భాస్కర్ తెలుగు చిత్ర దర్శకుడు. ఇతని మొదటి సినిమా ప్యామిలి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బొమ్మరిల్లు సినిమా ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు.

శ్రీకాంత్ అడ్డాల : అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాలా సినిమాల్లో పనిచేసిన తరువాత, శ్రీకాంత్ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్‌లతో కలిసి తన తొలి చిత్రం కోత బంగారు లోకం దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు.

వేణు శ్రీరామ్ : 2011 లో ఓహ్ మై ఫ్రెండ్ చిత్రంతో దర్శకత్వం వహించారు. దిల్ రాజు చేత సినీ పరిశ్రమకు పరిచయం అయ్యరు.

ఈ సినీ తారల ఆత్మహత్యల మిస్టరీ..!

గోపీచంద్ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్..!

జయసుధకి విజయ నిర్మల గారు ఏమవుతారో తెలుసా ?

బాలయ్య బాబు గురించి మనకు తెలియని నిజాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -