Friday, April 26, 2024
- Advertisement -

త్రివిక్రమ్‌ భార్య.. ఇంత టాలెంట్ ఉందా ?

- Advertisement -

మినిమం సినిమా అవగాహణ ఉన్న ప్రతి ఒక్కరికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి తెలిసే ఉంటుంది. రచయితగా మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఆయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ , యూత్, మాస్ ఇలా అందర్ని ఆకట్టుకునేలా ఉంటాయి. ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న ఆయన భార్య గురించి చలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆమె ఎక్కువగా బయట కానీ సోషల్ మీడియాలో కానీ కనిపించరు.

ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ భార్య ఫోటోలో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అంతకు ముందుకు త్రివిక్రమ్ కు పెళ్లి అయిందా.. ఆయన భార్య ఎవరు అని అడిగేవారు చలా మంది. త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య. ఆమె సిరివెన్నెల సీతారామశాస్త్రీ గారి బంధువుల అమ్మాయి. పెళ్లికి ముందు నుంచి కూడా సౌజన్య మంచి క్లాసికల్ డాన్సర్. అందుకే ఆమె తాజాగా వైజాగ్ లో ఒక ప్రదర్శణ చేసింది. సెలబ్రిటీల భార్యలు స్టేజ్ షోలు ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించరు.

కానీ త్రివిక్రమ్ భార్య అభిరుచిని గ్రహించి మాత్రం వైజాగ్ లోని కళాభారతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సౌజన్యతో ప్రదర్శణ ఇప్పించారు. ఈ కార్యక్రమంకు స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సీతారామ శాస్త్రీ, త్రివిక్రమ్ ఇంకా కొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సౌజన్య గారి డాన్స్ తో మా కళాభారతి కార్యక్రమం పెద్ద హిట్ అయిందని నిర్వాహకులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -