పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దోచేసిన యువతి..!

407
woman cheated software engineer in bangalore
woman cheated software engineer in bangalore

మారుతున్న కాలంలో ఎంతటికైన తెగించడానికి రెడీగా ఉంటున్నారు కొందరు. కొందరు మాయ చేసి మోసం చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఓ మెట్రిమోనియల్ సైట్ ద్వారా ఓ యువతి పరిచయం అయింది. ఇద్దరు వివాహం చేసుకుందాం అనుకున్నారు. ఈ నేపథ్యంలో తరచూ ఫోన్ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో అతడికి మరింత దగ్గరైన ఆ యువతి వివిధ కారణాలు చెప్పి అతని నుంచి ఏకంగా రూ. 16.82 లక్షలు తీసుకుంది.

ఆ తర్వాత అతడిని నెమ్మదిగా దూరం పెట్టింది. ఆ తర్వాత ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా తీసుకున్న డబ్బు కూడా ఇవ్వలేదు. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలిసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి ఘటనే బెంగళూరులో మరొకటి జరిగింది. బనశంకరికి చెందిన మహిళ (30) ఓ కంపెనీలో పనిచేస్తోంది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె రెండో వివాహం చేసుకోవాలని ఓ మేట్రిమోనియల్ సైట్‌లో తన ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసింది. దాంతో ఈమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తర్వాత వారు తరుచు మాట్లాడుకునేవారు.

అయితే అతను వివిధ కారణాలు చూపుతూ రూ. 7 లక్షలు తీసుకున్నాడు. తర్వాత పత్తా లేకుండా పోయాడు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో తన నుంచి తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరినప్పటికీ అతడి నుంచి స్పందన లేకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా చేస్తే.. రికార్డ్ చేసినవి అక్షర రూపంలో పొందవచ్చు..!

షియాజీ షిండే గురించి ఎవరికి తెలియని విషయాలు..!

నువ్వే కావాలి హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?

ఫ్రెండ్ లా భార్యతో చాటింగ్ చేసి కోటి నొక్కన భర్త..!

Loading...