Wednesday, April 24, 2024
- Advertisement -

ఇలా చేస్తే.. రికార్డ్ చేసినవి అక్షర రూపంలో పొందవచ్చు..!

- Advertisement -

ప్రస్తుతం ప్రింట్, ఎలాక్ర్టానిక్ మీడియాలతో పాటు డిజిటల్ మీడియా కూడా బాగా పాపులర్ అయింది. అందరు ఫోన్ లోనే వార్తలను చదివేస్తున్నారు. అలాగే చూస్తున్నారు. అయితే ఈ వార్తలను సేకరించేది జర్నలిస్ట్. ఎంతంటి వార్తలనైన నిమిషాల్లో సేకరించి ప్రజల ముందు ఉంచాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వేగవంతమైన వార్తలకు ప్రాధాన్యత ఉంది. ఇప్పటికే చాలా మార్పులు ఈ జర్నలిస్టు జీవితాల్లో వచ్చాయి. కాలంతో పాటు మనం నడవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. అయితే వార్తలను వేగంగా చేర్చడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైన ప్రెస్ మీట్ కానీ ఇతర కార్యక్రమాల్లో కాని అక్కడ వారు మాట్లాడినప్పుడు అది విని రాయడం అనేది కష్టతరమైన పనే. ఇలాంటి సమయంలో వార్తలను తొందరగా సేకరించేలా ఏదైన సాఫ్ట్ వేర్ ఉంటే బాగుంటుందని చాలా మంది జర్నలిస్టులు అభిప్రాయపడేవారు. అయితే టేక్నాలజీ ఇందుకు సహకరించిందనే చెప్పాలి. ఏదైన ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలను రికార్డు చేసి.. అది ఆడియో కానీ వీడియో కానీ.. ఏదైన సరే అలా రికార్డ్ చేసిన వాటిని అక్షర రూపంలోకి మార్చే సాఫ్ట్ వేర్ ఒకటి ఇప్పుడు అందుబాటులో ఉంది.

దాని పేరే “ప్లాష్ స్క్రైబ్”. ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఏదైన ప్రెస్ మీట్ లో రికార్డ్ చేసినవి దీని ద్వారా అక్షర రూపంలోకి నిమిషయంలో మార్చేసి.. వార్తలను త్వరగా అందించవచ్చు. దీంతో పని కూడా సులభం అవుతుంది. ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు ఈ సాఫ్ట్ వేరు ని వాడుతున్నట్లు చెబుతున్నారు. సో జర్నలిస్టులే కాదు. ఇతర ఎవరైన సరే తమకు కావాల్సిన సమాచారం ఆడియో లేదా వీడియో రూపంలో ఉంటే వెంటనే ఈ సాఫ్ట్ వేర్ ద్వారా అక్షర రూపంలోకి మార్చేయొచ్చు. సో ఇది చాలా బాగుంది కదా.. మీరూ కూడా వాడి చూడండి.

12 ఏళ్ల క్రింద ఇంట్లోంచి వెళ్లిపోయిన వ్యక్తిని పట్టుకున్న టిక్‌టాక్..!

ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ యాక్సెఫ్ట్ చేస్తే మీ పని ఫట్..!

సాయి పల్లవి గురించి మీకు తెలియని నిజాలు !

BSNL ఆఫర్ : అన్ లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -