Friday, April 26, 2024
- Advertisement -

రాహుల్‌ను కెప్టెన్ చేయడానికి కారణం ఇదే : కుంబ్లే

- Advertisement -

భారత జట్టు బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ వచ్చే ఐపీల్ సీజన్ లో కింగ్ ఎలెవన్ పంజాబ్ కు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే రాహుల్ జట్టు సారథిగా నియమించడానికి కారణం ఏంటో ఆ జట్టు కోచ్, భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే చెప్పారు. రాహుల్ కెరీర్ దృష్టిలో ఉంచుకునే అతన్ని కెఫ్టెన్ గా నియమించామని.. ఈ బాధ్యత అతనికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు.

“కేవలం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు గురించి మాత్రమే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోలేదు. రాహుల్ కెరీర్ ను కూడా దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. కెఫ్టెన్ గా బాధ్యతలు అందుకోవడానికి ఇదే అతనికి సరైన టైం. ఈ బాధ్యత అతడు నాయకుడిగా ఎదగడానికి దోహదపడతాయి” అని ఆనిక్ కుంబ్లే చెప్పారు.


“టీమిండియా ఆటగాడు ఐపీఎల్ లో కెఫ్టెన్ గా ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇందుకు రాహుల్ సరైన వ్యక్తిగా భావించాం. రాహుల్ గత రెండు ఏళ్లుగా పంజాబ్ తరుపున మంచి ప్రదర్శన చేస్తున్నాడు. వచ్చే సీజన్ లో రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తాడా అనే విషయంపై స్పష్టత లేదు. నికోలస్ పూరన్ కూడా మంచి వికెట్ కీపింగ్ చేయగలడు. సీజన్ ప్రారంభం అయ్యే ముందు దీనిపై నిర్ణయం తీసుకుంటాం. రాహుల్‌తో కలిసి మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, కృష్ణప్ప గౌతమ్‌ జూనియర్‌ లెవల్‌ క్రికెట్‌లో, కర్ణాటక జట్టులో ఆడారు. వారి మధ్య సమన్వయం రాహుల్ కి ఎంతో ఉపయోగపడుతోంది” అని కుంబ్లే అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -