Saturday, April 27, 2024
- Advertisement -

రోహిత్ శర్మకి బౌలింగ్ చేయను : ఆసీస్ దిగ్గ‌జ పేస‌ర్‌

- Advertisement -

భార‌త క్రికెట్లో ప్లేయ‌ర్‌ రోహిత్ శ‌ర్మ ఎలాంటి బ్యాట్స్ మెనో అందరికి తెలిసిందే. వ‌న్డేల్లో మూడు డబుల్ సెంచ‌రీల‌తోపాటు, టీ20ల్లో నాలుగు సెంచ‌రీలు చేశాడు. అతను ఒక్కసారి రంగంలో దిగి రెచ్చిపోయాడంటే రికార్డు బద్దలుకొట్టాడానికి రెడీ అయ్యాడని అర్దం చేసుకోవచ్చు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ పేస‌ర్ బ్రెట్ లీ.. హిట్ మ్యాన్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

రోహిత్ టాపార్డ‌ర్‌లో ఉంటే, త‌ను బౌలింగ్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌న‌ని లీ పేర్కొన్నాడు. ’ప్ర‌స్తుతం రోహిత్ చాలా విధ్వంస‌రంగా ఆడుతున్నాడు. అత‌ని కెరీర్ తొలి నాళ్ల‌లో బంతిని అద్భుతంగా టైమింగ్ చేసేవాడు. అతను షాట్లు ఆడుతూంటే వ‌చ్చే శ‌బ్ధం ఎంతో విన‌సొంపుగా ఉండేది. ముఖ్యంగా బంతి మిడిలైనప్పుడు ఇంకా ఆహ్లాద‌క‌రంగా వినిపించేది. ఒక్క‌సారి కుదురుకున్నాక త‌ను ప‌రుగుల వ‌ర‌ద పారించేవాడు ’ అని బ్రెట్ లీ గుర్తు చేసుకున్నాడు.

ఇక ఆరంభం నుంచే అద్భుతమైన బ్యాటింగ్ చేసే రోహిత్ లాంటి టాపార్డర్ ఉంటే అసలు బౌలింగ్ చేయనని బ్రెట్ లీ అన్నాడు. నిజానికి రోహిత్ కెరీర్ తొలినాళ్ల‌లో మిడిలార్డ‌ర్‌లో ఆడేవాడు. ఆ స‌మ‌యంలో లీని ఎదుర్కొన్నాడు. 2013లో ఓపెన‌ర్‌గా ప్ర‌మోష‌న్ పొందాక హిట్‌మ్యాన్ వెనుదిరిగి చూసుకోలేదు. అక్క‌డి నుంచి వైట్ బాల్ క్రికెట్‌లో త‌న హ‌వాను కొన‌సాగిస్తున్నాడు. మ‌రోవైపు 2012లోనే లీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -