Friday, April 26, 2024
- Advertisement -

నేనేమి రోబోను కాదు నాక్కూడా విశ్రాంతి కావాలి …కోహ్లీ

- Advertisement -

నా శరీరం విశ్రాంతిని కోరుకుంటే.. కచ్చితంగా తీసుకుంటాన‌ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విలేకుర్ల స‌మావేశంలో తెలిపారు. శ్రీలంక‌తో రేప‌టి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సిరీస్ త‌ర్వాత బీసీసీఐని విశ్రాంతి అడిగారనె వార్త‌ల‌పై స్పందించారు. త‌న‌కు రెస్ట్ కావాల‌ని అనిపించిన‌ప్పుడు క‌శ్చితంగా తీసుకుంటాన‌ని నేనేమి రోబోను కాద‌ని బ‌దులిచ్చారు. త‌న చ‌ర్మం,మెడ‌ను కోసినా రక్త‌మే వ‌స్తుంద‌ని సెటైర్ వేశారు.

హార్థిక్ పాండ్యా మొద‌టి రెండు టెస్ట‌ల‌కు రెస్ట్ తీసుకోవ‌డంపైకూడా విరాట్ స్పందించారు. మైదానంలో ఎక్కువగా కష్టపడేవారికి రెస్ట్ అవసరమని చెప్పాడు. ఆటగాళ్లంతా ఏడాదికి 40 మ్యాచ్ లు ఆడతారని… ఒక్కో ఆటగాడి ఆట ఒక్కో విధంగా ఉంటుందని… క్రీజులో నిలిచే సమయం, వేసే ఓవర్ల సంఖ్య అందరికీ ఒకేలా ఉండదని… ఎక్కువ కష్టపడేవారికి కచ్చితంగా రెస్ట్ అవసరమని అన్నాడు.

ప్రస్తుతం 20 నుంచి 25 మంది ఆటగాళ్లతో కూడిన స్ట్రాంగ్ కోర్ టీమ్ ఉందని… దీంతో, ఆటగాళ్లు రెస్ట్ తీసుకోవడానికి వెసులుబాటు కలగుతుందని కోహ్లీ చెప్పాడు. విశ్రాంతి లేకపోవడం వల్ల కీలకమైన ఆటగాళ్లు కీలకమైన మ్యాచ్ లలో బ్రేక్ డౌన్ కావడాన్ని మీరు కోరుకుంటున్నారా? అంటూ ప్రశ్నించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -