Friday, April 26, 2024
- Advertisement -

ర‌ఫ్ఫాడించిన ఆండ్రూ రసెల్‌…హైద‌రాబాద్‌పై కోల్‌క‌తా అద్భ‌త విజ‌యం

- Advertisement -

చెన్నై, బెంగులూరు మ‌ధ్య ఐపీఎల్ చ‌ప్ప‌గా సాగుతే కోల్‌క‌తా, హైద‌రాబాద్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ హాట్ హాట్‌గా సాగింది. అభిమానుల‌కు అస‌లైన మ‌జా ఇచ్చింది మ్యాచ్‌. హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్‌పై కోల్‌క‌తా అద్భుత మైన విజ‌యాన్ని సాధించింది. సిక్సర్ల మోత, బౌండరీల వర్షంతో తడిసి అసలైన ఐపీఎల్ మజాను అస్వాదించారు అభిమానులు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో ఛేదించింది. ఆ జట్టు ఆల్‌రౌండర్‌ ఆండ్రూ రసెల్‌ (49 నాటౌట్‌; 19 బంతుల్లో 4×4, 4×6) భారీ సిక్సర్లతో ఆటను మలుపు తిప్పాడు. ఓపెనర్ నితీశ్‌ రాణా (68; 47 బంతుల్లో 8×4, 3×6) శుభారంభం అందించాడు. రాబిన్‌ ఉతప్ప (35) ఫర్వాలేదనిపించాడు.

భారీ లక్ష్యచేధనతో బ్యాటింగ్ ప్రారంభించిన 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. షకీబ్ ఉల్ హసన్ బౌలింగ్‌లో 7 పరుగులు చేసిన క్రిస్ లీన్, రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తీశ్ రాణా, రాబిన్ ఊతప్ప కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించిన తర్వాత రాబిన్ ఊతప్ప అవుట్ అయ్యాడు .నితీశ్ రాణా 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేసిన రాణాను రషీద్ ఖాన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 17వ ఓవర్ వేసిన భువీ కేవలం 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది.సిద్ధార్థ్ కౌల్ ఓవర్లో మొదటి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు రసూల్. ఈ ఓవర్‌లో 19 పరుగులు రాబట్టిన రసూల్… తర్వాత భువనేశ్వర్ ఓవర్‌లో ఫోర్, సిక్స్, ఫోర్, సిక్స్ బాది 21 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ రెండు సిక్సర్లు బాది విజయాన్ని ముగించాడు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 181 పరుగుల భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా వంద పరుగులు చేసింది .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -