రోహిత్‌కి జోడీగా రాహులే బేటర్.. ధావన్ వద్దు : ఆకాశ్ చోప్రా

492
rohit sharma kl rahul should be first preference aakash chopra on india’s t20i opening pair
rohit sharma kl rahul should be first preference aakash chopra on india’s t20i opening pair

టీ20ల్లో ఓపెనింగ్ లో రోహిత్ శర్మకి జోడీగా శిఖర్ ధావన్ వద్దని, లోకేష్ రాహుల్ బెటర్ అని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్‌‌ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తాజాగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో చాట్ షో నిర్వహించగా.. టీ20ల్లో ఓపెనింగ్ జోడీ గురించి మీ అభిప్రాయం చెప్పాలని ఓ అభిమాని ప్రశ్నించాడు.

” రోహిత్, ధావన్ ఓపెనింగ్ జోడికి శకం ముగిసిందని నేను అనుకోవట్లేదు. ఇప్పటికీ ధావన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే రోహిత్, రాహుల్ తో పోలీస్తే ధావన్ వెనకబడ్డాడు. నా అంచనా ప్రకారం టీ20ల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వీరిద్దరే బెస్ట్ ఓపెనింగ్ జోడి’ అని చోప్రా చెప్పాడు. ఇక వన్డేల్లో ఓపెనింగ్ జోడి గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. “వన్డేల్లో రోహిత్, ధావన్ కాంబినేషన్ బాగుంటుంది. వన్డేల్లో రోహిత్-ధావన్ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు.

ఇద్దరూ సెంచరీల భాగస్వామ్యాలు నెలకొల్పడం మనం చూసే ఉంటాం. వన్డేల్లో రాహుల్ ఏ స్థానంలోనైనా ఆడగలడు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఎక్కడైనా అతడు పరుగులు చేస్తాడు’ అని పేర్కొన్నాడు. ఇక రాహుల్ మంచి ఆటగాడు అని చెప్పిన చీప్రా.. అతడు టెస్టుల్లో ఆడే అవకాశం లేదన్నాడు. టాప్‌, మిడిల్‌ ఆర్డర్లలో ఇప్పటికే సరిపడా బ్యాట్స్‌మన్‌ ఉన్నారన్నాడు. ఇక కీపింగ్‌ విభాగంలోనూ వృద్ధిమాన్‌ సాహాను తప్పించడానికి అతడు ఏ తప్పూ చేయలేదన్నాడు. ఇప్పటికైతే రాహుల్‌ టెస్టుల్లో ఆడాలంటే వేచిచూడాలని చోప్రా పేర్కొన్నాడు.

ధోనీ రిటైర్మెంట్ గురించి రైనా ఏమన్నాడంటే ?

సచిన్ కోసం స్కూల్ డుమ్మా.. : రైనాకు షాక్ ఇచ్చిన భజ్జీ..!

చెన్నై సూపర్ కింగ్స్ లో హిట్టర్‌ని సిద్దం చేస్తున్న ధోనీ..!

సోషల్ మీడియాకు ధోనీ దూరంగా ఉండటానికి కారణం చెప్పిన సాక్షి..!

Loading...