విరాట్ కోహ్లీని సోషల్ మీడియాలో ఆడుకుంటున్న నెటిజన్లు…

442
Virat Kohli posts shirtless picture in socialmedia , netizens mock
Virat Kohli posts shirtless picture in socialmedia , netizens mock

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ముందుంటారు. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. అభిమానులను ఖుషి చేస్తుంటారు.దక్షిణాఫ్రికాతో ఈనెల 15 నుంచి టీ20 సిరీస్ మొదలుకానుండగా.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ తాజాగా ఓ ఫొటోని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అంతే కోహ్లీని నెటిజన్లు కబడీ ఆడుకుంటున్నారు.

‘మన అంతరంగంలోకి మనం చూసుకున్నంత కాలం.. బయటి దేని గురించి మనం వెతకవలసిన అవసరం లేదు’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు కోహ్లి . ఫొటోలో విరాట్ కోహ్లీ కేవలం అండర్‌వేర్ మాత్రమే ధరించి ఉండటంతో.. దినేశ్ మందన్ తరహాలో ట్రాఫిక్ ఛలానా కట్టిన తర్వాత కోహ్లీ పరిస్థితి ఇది అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం ట్రాఫిక్‌ అధికారులు ఆర్సీ, హెల్మెట్‌ లేదనే కారణంతో ఓ వ్యక్తికి రూ.23 వేల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొనె నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.ఇప్పుడు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఫొటో వైరల్‌గా మారింది.

Loading...