Thursday, May 2, 2024
- Advertisement -

దంచి కొట్టిన ఆసిస్ ఓపెన‌ర్లు..చిత్తు చిత్తుగా ఓడిన పాక్‌..

- Advertisement -

ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం టాంటన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. తొలుత బౌలింగ్‌లో పుంజుకుని ప్రత్యర్థిని కట్టడి చేసిన ఆ జట్టు… బ్యాటింగ్‌లో మంచి స్థితిలో ఉండీ గెలుపును చేజార్చుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌట్ అయింది.

ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (111 బంతుల్లో 107; 11 ఫోర్లు, సిక్స్‌) శతకం బాదడంతో పాటు కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ (84 బంతుల్లో 82; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించడంతో… టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. తొలి వికెట్‌కు 146 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఫించ్ తర్వాత షాన్ మార్స్ చేసిన 23 పరుగులే అత్యధికం. పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ ధాటికి ఆసీస్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. పది ఓవర్లు వేసి 30 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆమిర్ 5 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 308 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ (75 బంతుల్లో 53; 7 ఫోర్లు), హఫీజ్‌ (46; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించినా మిడిలార్డర్‌ వైఫల్యం దెబ్బకొట్టింది. హక్ 53, బాబర్ ఆజం 30, మహ్మద్ హఫీజ్ 46, సర్ఫరాజ్ అహ్మద్ 40, హసన్ అలీ 32, వాహబ్ రియాజ్ 45 పరుగులు చేశారు. పాక్ ఆటగాళ్లలో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లు వరుసపెట్టి వికెట్లు తీసి పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టేశారు. దీంతో పాక్ 266 పరుగులకే కుప్పకూలి 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -