Saturday, April 27, 2024
- Advertisement -

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బాయ్ చెప్పిన యువ‌రాజ్ సింగ్‌..

- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గుడ్ బై చెప్పారు. 2011 వరల్డ్ కప్‌ను భారత్ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించిన యూవీ అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి త‌ప్పుకున్నాడు. 2019 వరల్డ్ కప్ జరుగుతోన్న వేళ.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. సిక్సర్ల వీరుడిగా, అండర్ 14, అండర్ 19, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్ క్రికెట్ లో మెరిసిన యువీ.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పేశాడు.

మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో క్యాన్సర్ బారిన పడిన యువీ.. ఆ తర్వాత కోలుకుని మళ్లీ భారత జట్టులో స్థానం సంపాదించాడు. అయితే, అనుకున్న సాఫీగా యువీ క్రికెట్ కెరీర్ సాగలేదు… కొద్ది నెలల క్రితం తాను వరల్డ్ కప్ 2019 వరకూ క్రికెట్ ను వీడేదిలేదని స్పష్టం చేసిన యువీ.. ఈ సారి వరల్డ్ కప్‌ జట్టులో లేకపోవడంతో.. ఓవైపు ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

పదిహేడేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగిన యూవీ, తన కెరీర్ లో 40 టెస్ట్ లు, 304 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు కొట్టిన అరుదైన రికార్డు యూవీ సొంతం. వన్డేల్లో 14, టెస్టుల్లో 3 సెంచరీలు చేశాడు. వన్డేల్లో 111, టెస్టుల్లో 9,  టీ-20లలో 28 వికెట్లు తీశాడు. యూవీ ఆల్ రౌండ్ ప్రదర్శనతో 2011 వరల్డ్ కప్ ను భారత్ గెల్చుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -