Friday, May 3, 2024
- Advertisement -

ఐపీఎల్‌ 2021: పునరాలోచనలో బీసీసీఐ!

- Advertisement -

కోవిడ్‌ పరిస్థితులను తట్టుకుని ఐపీఎల్‌-2020ని విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌ నిర్వహణకు సంబంధించి సమాయత్తం అవుతోంది. అయితే, ప్రస్తుతం ఉన్న ఎనిమిది జట్లతో పాటు ఐపీఎల్‌–2021లో అదనంగా మరో రెండు టీమ్‌లను చేర్చాలనే అంశంపై బీసీసీఐ పునరాలోచనలో పడినట్టుగా తెలిసింది. వచ్చే లీగ్‌ను ప్రస్తుతం ఉన్న తరహాలోనే కొనసాగించి 2022లో పది జట్లను ఆడిస్తే బాగుంటుందని బోర్డు పాలక మండలిలో పలువురు సూచించినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఐపీఎల్‌-2021 కి సమయం పెద్దగా లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అహ్మదాబాద్‌లో వచ్చే గురువారం జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

‘ఐపీఎల్‌-2021 మొదలవడానికి కనీసం 4 నెలల సమయం కూడా లేదు. ఇంత తక్కువ సమయంలో కొత్తగా రెండు జట్లను ఎంపిక చేయడం, ఆటగాళ్ల వేలం నిర్వహించి టోర్నీకి సిద్ధం చెయ్యండ సాధ్యమయ్యే పనికాదు. పైగా ఆట మాత్రమే కాకుండా ఇన్నేళ్లుగా సాగుతున్న ఐపీఎల్‌ వ్యవస్థలో వారు భాగమై అలవాటు పడేందుకు ఈ సమయం సరిపోదు. దానికి బదులు ఐపీఎల్‌-2022లో 10 జట్లను ఆడిస్తే సరిపోతుంది. జట్ల ఎంపిక, స్పాన్సర్లు, మీడియా హక్కులు, టెండర్లు… ఇలా అన్ని విషయాల్లో హడవుడి లేకుండా ప్రశాంతంగా పని చేయవచ్చు’ అని బోర్డు సీనియర్‌ సభ్యుడొకరు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -