Monday, May 6, 2024
- Advertisement -

పెట్రోల్ బంక్ లో మాజీ క్రికెటర్ చేసిన పనికి షాక్..!

- Advertisement -

ప్రస్తుతం శ్రీలంకలో ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో దేశం అల్లాడుతుంటే.. ప్రజలు ఆహార కొరతతో విలవిలలాడుతున్నారు. నిత్యవసర వస్తువులు ఏవి కూడ ప్రజలకు అందని దారుణ పరిస్థితులు శ్రీలంకలో నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అక్కడ ఎన్నో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కొత్త ప్రభుత్వం దేశంలోని ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించేందుకు విశ్వ ప్రయత్ననే చేస్తోంది.

ఇదిలా ఉండగా శ్రీలంకలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు సాయంగా ఎంతో మంది సెలబ్రేటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ రోషన్ మహనామా చేసిన పనికి ప్రశంశల వర్షం కురుస్తోంది. శ్రీలంకలో పెట్రోల్ బంక్ లవద్ద ఫ్యూల్ కోసం ప్రజలు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. దాంతో ప్రజల ఇక్కట్లను గమనించిన మహనామా .. పడిగాపులు పడుతున్న ప్రజలకు టీలు, స్నాక్స్ సర్వ్ చేశాడు.

ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో రాసుకోస్తూ.. ” క్యూలో ఉన్న వాళ్ళలో చాలా మందికి అనారోగ్య సమస్యలు ఉండవచ్చు, అందువల్ల వాళ్ళు చాలా సేపు క్యూ లో నిలవడం వల్ల వారికి ఆకలి గా ఉండవచ్చు. అందుకే వారికి సాయం చేయాలనిపించి, ఇలా చేశానంటూ ” ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రోషన్ మహనామా చేసిన పని చూసిన నెటిజన్స్ అతనిపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. అతడు చూపుతున్న మానవత్వానికి చాలా మంది ఫిదా అవుతూ సోషల్ మీడియా లో పాజిటివ్ గా కామెంట్స్ పెడుతూ ఆ పోస్ట్ నూ విపరీతంగా వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చైనా అమెరికా వార్.. కారణం ఆదేనా ?

పీకల్లోతు కష్టాల్లో పాక్.. దివాళా అంచున దేశం ?

శ్రీలంక .. గట్టెక్కేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -