చైనా అమెరికా వార్.. కారణం ఆదేనా ?

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్రలో అమెరికా ఉంటే.. ప్రపంచ దేశాలకు టెక్నాలజీ పరంగా కొత్త అర్థం నేర్పించే స్థానంలో చైనా ఉంది. ఈ ఇరు దేశాలు సాంకేతికంగాను, సైనిక సామర్థ్యం విషయంలోనూ, ఆర్థికంగాను, అన్నీ రకాలుగా బాగా అభివృద్ది చెందిన దేశాలు. అయితే ఈ రెండు దేశాల మద్య గత కొన్నేళ్లుగా పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనెంతలా విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు కాస్త ఈ మద్య కాలంలో మరింత పెరిగి వివాదంగా మారుతున్నాయి. దానికి ముఖ్య కారణం తైవాన్ దేశం. అసలేంటి తైవాన్ కు చైనా అమెరికాకు మద్య ఉన్న లింకేంటి ? అనే విషయాలను తెలుసుకుందాం !

తైవాన్ చాలా చిన్న దేశం. ఇది చైనాకు అనుకోని ఉంది. ఈ చిన్న దేశాన్ని ఆక్రమించుకునేందుకు చైనా ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. కానీ తైవాన్ మాత్రం చైనాలో కలిసేందుకు ఏమాత్రం సుముఖత చూపడంలేదు.అంతే కాకుండా ఇటీవల కాలంలో తైవాన్ తనకు తాను సార్వభౌమాధికార దేశంగా ప్రకటించుకుంది. కానీ చైనా మాత్రం తైవాన్ తమ అంతర్భాగం అని చెప్పుకొస్తోంది. తైవాన్ అధికారికంగా స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం ఒక రకంగా చైనాను ప్రేరేపించడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. తైవాన్ సార్వభౌమాధికార దేశంగా ప్రకటించుకున్నప్పటికి ఆదేశ అద్యక్షురాలు సై ఇంగ్ వెన్ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు వెనుకడుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తైవాన్ కు అమెరికా అండగా నిలుస్తోంది. తైవాన్ కూడా అమెరికను మిత్రదేశంగా పరిగణిస్తోంది.

- Advertisement -

దాంతో చైనా ఈ రెండు దేశాల మద్య స్నేహంపై నిప్పులు చెరుగుతోంది. తైవాన్ ను శాంతియుతంగా విలీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు చైనా జనరల్ లీ ఆ మద్య చెప్పుకొచ్చారు. కానీ చైనాను ప్రేరేపించే విధంగా అమెరికా చర్యలు చేపడితే ఎంతకైనా తెగిస్తామని చైనా గట్టి వార్నింగ్ ఇస్తోంది. తైవాన్ సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించేందుకు అమెరికా పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ మద్య జో బైడెన్ చెప్పుకొచ్చారు. దానికి ఘాటుగానే జవాబిస్తోంది చైనా.. ” చైనా నుంచి తైవాన్ ను విడదీయాలని చూస్తే.. పోరాడేందుకు ఏమాత్రం వెనుకాడబోమని, ఎట్టి పరిస్థితుల్లో చివరివరకు పోరాడతామని..” చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్ వి ఫేంఘి సింగపూర్ లో జరిగిన ఆసియా సెక్యూరిటీ శాంగ్రీ లా సమావేశం లో చెప్పుకొచ్చారు. దాంతో తైవాన్ విషయంలో చైనా, అమెరికా మద్య వివాదం తారస్థాయికి చేరుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. యుద్దానికి దారితీసే పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

పాపం శ్రీలంకను.. పట్టించుకొని దేశాలు !

సంచలన నిర్ణయంతో చైనా.. ఆందోళనలో ఆయా దేశాలు !

పెను సంక్షోభంలో పాకిస్తాన్ ..గట్టెక్కేనా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -