Sunday, May 5, 2024
- Advertisement -

వెంకయ్యకు ఝలక్ ఇచ్చిన బీజేపీ ..కారణం ఆదేనా ?

- Advertisement -

ప్రస్తుతం దేశ దేశ ప్రజలు రాష్ట్రపతి ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాంతో జూలై 18 జరిగే ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సరికొత్త ప్రణాళికలతో రేస్ లోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థి ఖరారుపై ఇటు అధికార ఎన్డీయే కూటమి.. అటు విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే విపక్షాలలోని నేతలు రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఎందుకంటే అధికార ఎన్డీయే కూటమి బలపరిచిన అభ్యర్థే దాదాపుగా రాష్ట్రపతి పీఠం అధిష్టించే అవకాశం ఉంది. దాంతో ఓటమిని ముందే గ్రహించిన విపక్షాల నేతలు రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిచేందుకు సుముఖత చూపడం లేదనే వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారు? అనే దానిపై నిన్న మొన్నటి దాకా జోరుగానే జరిగాయి.

ముఖ్యంగా ప్రస్తుతం ఉపరాష్ట్రపతి గా ఉన్న వెంకయ్య నాయుడుని రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేయడం ఖాయమని భావించరంతా. ఎందుకంటే అధికార కూటమికి చెందిన వారు ఉపరాష్ట్రపతి పదవిలో ఉంటే దాదాపుగా వారేనే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. దాంతో వెంకయ్య నాయుడు రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని ప్రధాని మోడీ వెంకయ్యకు ఝలక్ ఇచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ మహిళా ద్రౌపది ముర్ము ను ఎన్డీయే ప్రకటించింది. దాంతో రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఉంటాడనే వార్తలకు తెరపడింది.

అయితే వివాదరహితుడుగా ఉన్న వెంకయ్యను కాదని ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రధాని మోడీ ఎంపిక చెయ్యడం రాజకీయ వర్గాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రపతి అభ్యర్థి కోసం దాదాపుగా 20 పేర్లను ఎన్డీయే కూటమి పరిశీలించిన తరువాత తూర్పు ప్రాంతాల వారిని ఎంపిక చేయాలని నిర్ణయించడంతో ద్రౌపది ముర్ము పేరు చర్చకు వచ్చిందని సమాచారం. ఇప్పటివకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసియులకు అవకాశం దక్కలేదు. దాంతో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ ఎస్టీ మహిళా ద్రౌపది ముర్ము ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే కూటమి ఖరారు చేసింది. ఈమె గతంలో ఉపాద్యాయురాలుగా జీవితం ప్రారంభించి ఆ తరువాత రాజకీయాల్లో కౌన్సిలర్, వైస్ చైర్మెన్, ఎమ్మెల్యే, మంత్రి, గవర్నర్ వంటి వివిధ హోదాలలో పని చేశారు. ఇక భారత రాష్ట్రపతిగా ఎస్టీ మహిళ ద్రౌపది ముర్ము .. పీఠాన్ని అధిష్టించడం లంచనప్రాయమే.

ఇవి కూడా చదవండి

కూల్ గా ఉన్న మోడీ .. టెంక్షన్ లో విపక్షాలు ?

జగన్, కే‌సి‌ఆర్ పథకాలు .. కాఫీనా ?

మోడీ రాక.. నేతల్లో కొత్త టెంక్షన్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -