Friday, April 26, 2024
- Advertisement -

జగన్, కే‌సి‌ఆర్ కు .. మోడీ జలక్ ?

- Advertisement -

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమదైన శైలిలో పరిపాలన సాగిస్తున్నారు. అభివృద్దే ధ్యేయంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఏపీ సి‌ఎం జగన్ ప్రవేశ పెడుతున్న పథకాలు అలాగే తెలంగాణలో కే‌సి‌ఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు .. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలే నంటూ బీజేపీ వర్గంలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా వార్తలు రావడానికి ప్రధాన కారణం.. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో నెలకొన్న పరిస్థితులే అని చెప్పవచ్చు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు దాదాపుగా కేంద్ర ప్రభుత్వ పథకాలను పోలి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రనికి చేరవలసిన నిధులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

పథకాలపై బెంగాల్ ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లుగా సమాచారం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వచ్ భారత్ మిషన్, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, వంటి పథకాలకు కేంద్రం నుంచి వచ్చే నిధుల ద్వారా వాటినే పేర్లు మార్చి నిర్మల్ బంగ్లా మిషన్, బంగ్లా సరక్ యోజన, వంటి పథకాలను అమలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో వాటిపై వివరణ కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో జగన్, కే‌సి‌ఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలపై కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో పథకాలుపై కేంద్ర వాటాల గురించి బీజేపీ, టి‌ఆర్‌ఎస్ పార్టీ నేతల మద్య గత కొంతకాలంగా వాడి వేడి విమర్శలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి వచ్చే నిధులతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తున్నారని, అక్కడ కే‌సి‌ఆర్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమి లేదని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే, వాటికి ధీటుగానే అధికార పార్టీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఇక ఏపీలో సి‌ఎం జగన్ తన తండ్రి పేరుతోనూ, తన పేరుతోనూ పలు పథకాలను అమలు చేస్తున్నారు.

అయితే కేంద్రం నుంచి వచ్చే నిదులతో సర్వ శిక్ష అభియాన్ లో భాగంగా ” జగనన్న విద్యకానుక “, మద్యాహ్నం భోజనం స్కీమ్ లో భాగంగా జగనన్న గోరు ముద్ద, సంక్షేమ వసతి గృహాల పథకం లో భాగంగా జగనన్న వసతి దీవెన వంటి పథకాలను అమలు చేస్తున్నారు. అయితే ఈ పథకాలన్ని కూడా కేవలం కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే అమలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేస్తున్నది ఏమి లేదనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం ఝలక్ ఇచ్చినట్లు రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆపె అవకాశం కూడా లేకపోలేదు. మరి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రవేశపెడుతున్న పథకాల వల్ల.. రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను స్టాప్ చేసి ప్రధాని నరేంద్ర మోడీ ఝలక్ ఇస్తారా ? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

ఇవి కూడా చదవండి

కొత్త వ్యూహాలతో కాంగ్రెస్.. ఫలించేనా ?

మోడీ రాక.. నేతల్లో కొత్త టెంక్షన్ !

బీజేపీకి జనసేన గుడ్ బై చెప్తుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -