మోడీ మౌనం అందుకేనా ?

- Advertisement -

రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశంలో పోలిటికల్ హిట్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రపతి అభ్యర్థుల ఎన్నిక విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి ప్రధానపార్టీలు. అధికార ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలో పక్క ప్రణాళికతో ఉన్నట్లు బీజేపీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విపక్షాలు మాత్రం అభ్యర్థి ఎన్నిక విషయంలో తర్జనబర్జన పడుతున్నాయట. ఎందుకంటే ఎన్డీయే బలపరిచిన అభ్యర్థికే మక్సిమమ్ ఓటు శాతం అధికంగా ఉండే అవకాశం ఉంది. దాంతో విపక్షాల తరుపున రేస్ లో నిలబడే అభ్యర్థులు ఓటమిని అంగీకరించడం ఇష్టం లేక ముందే రేస్ నుంచి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారట.

విపక్షాల తరుపున ఉమ్మడి అభ్యర్థిగా నిలబడేందుకు మొదట శరత్ పవార్ పేరు ఆ మద్య గట్టిగానే వినిపించింది. కానీ ఆయన ఏమాత్రం ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఇక ఫరాక్ అబ్దుల్లా, శరత్ తాంబికా, దేవగౌడ వంటి వారి పేర్లు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. కానీ వారు కూడా అభ్యర్థి రేసు లో నిలబడేందుకు సుముఖత చూపడంలేదని వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. ఇక విపక్షలకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ గోపాలకృష్ణగాంధీ.. ఆయన కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడేందుకు వెనుకడుగు వేస్తే..ఎన్డీయే బలపరిచిన అభ్యర్థి గెలుపు దాదాపు ఏకగ్రీవం అవుతుంది. దాంతో ప్రస్తుతం అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా ప్రశాంతంగా వ్యవహరిస్తున్నారట.

- Advertisement -

ఇక బీజేపీ పైన, నరేంద్ర మోడీ పాలన పైన ఎప్పుడు నిప్పులు చెరిగే మమతా బెనర్జీ సైతం విపక్షాల తరుపున ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయంలో విశ్వ ప్రయత్నలే చేస్తున్నప్పటికి .. ఆమె ప్రయత్నాలు ఏమాత్రం పాలించడం లేదు. ఇక ఈ నెల 29 లోపు అభ్యర్థులను ఎంపిక చేసి నామినేషన్ పత్రాలను సమర్పించవలసి వుంటుంది. ఇక జూలై 18 ఓటింగ్, జూలై 21న ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ మొత్తం జూలై 24తో పూర్తి కానుండగా, జూలై 25 నుంచి దేశానికి కొత్త రాష్ట్రపతి అధికారం చేపట్టనున్నాడు.

ఇవి కూడా చదవండి

కొత్త వ్యూహాలతో కాంగ్రెస్.. ఫలించేనా ?

పవన్ కు తలనొప్పిగా మారిన.. ఆ సమస్య ?

అలా చేస్తే కే‌సి‌ఆర్ కు ముప్పే ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -