Monday, May 13, 2024
- Advertisement -

రేప‌టిలోగా ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోపీలో ఆడే భార‌త జ‌ట్టును ప్ర‌ట‌కించాల‌ని ఆదేశించిన సీఓఏ

- Advertisement -
ICC Champions Trophy-2017 Team Captain and Players selection on monday

ఐసీఐసీ ఛాంపియ‌న్స్ ట్రోపీలో భార‌త్ అడటంపై ఉత్కంఠ నెల‌కొంది.ఆదాయ పంపినీలో భార‌త్‌కు దక్కాల్సిన ఆదాయంలో భారీగా గండికొట్టిన ఐసీసీతో ఘర్షణ వైఖరే సరైందని బీసీసీఐ సీనియర్‌ అధికారులు భావిస్తున్నారు.గ‌త నెల 25 వ‌తేదీనాటికే జ‌ట్టును ప్ర‌క‌టించాల్సిఉన్నా ఆదాయ పంపినీ విష‌యంలో నెల‌కొన్న వైఖ‌రే అందుకు కార‌నం.

అయితే దీనిపై సుప్రీంకోర్టు నియ‌మించిన సీఏవో క‌మిటీ క‌ల‌గ జేసుకొని ఛాంపియ‌న్స్‌ట్రోలో ఆడే జ‌ట్టును ప్ర‌క‌టించాల‌ని లేకుంటె కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని హెచ్చ‌రించ‌డంతో ఈరోజు జరగబోయే ప్రత్యేక సర్వ సభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో తేలనుంది.
టోర్నీని బహిష్కరిస్తే తప్ప ఐసీసీని దారిలోకి తెచ్చుకోలేమని బోర్డులో ఓ వర్గం పట్టుదలతో ఉండగా.. మరో వర్గం మాత్రం బహిష్కరణ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సౌత్‌ జోన్‌ పరిధిలోని రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలపై గట్టి పట్టున్న బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో పాటు ఒకప్పటి బీసీసీఐ పాలకుల్లో చాలామంది ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌ బహిష్కరించాలనే పట్టుబడుతున్నట్లు సమాచారం.వెస్ట్‌ జోన్‌కు చెందిన నిరంజన్‌ షా అయితే ఐసీసీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఐతే బహిష్కరణ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాలకుల కమిటీ (సీఓఏ).. నార్త్‌, ఈస్ట్‌ జోన్ల పరిధిలోని రాష్ట్ర సంఘాల మద్దతు సంపాదించినట్లు తెలుస్తోంది.ఈస‌మావేశంలో మిశ్ర‌మ స్పంద‌న క‌నిపిస్తోంది.

{loadmodule mod_custom,Side Ad 1}
ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఎస్‌జీఎంలో ఏం తేలుతుంది అన్న దాన్ని బట్టి ఈ టోర్నీకి జట్టు ఎంపిక చేయడంపై నెలకొన్న ఉత్కంఠకు కూడా ఆదివారమే తెరపడుతుందని భావిస్తున్నారు. బోర్డు సంయుక్త కార్య‌ద‌ర్శి అమితాబ్ చౌద‌రి…. బీసీసీఐ తాత్కాలిక అధ్య‌క్షుడు వీకే ఖ‌న్నామ‌ద్య బేదాబిప్రాయాలు వ‌చ్చాయి.ఇక జట్టు ఎంపిక సోమవారం జరుగుతుందని తాత్కాలిక అధ్యక్షుడు వీకే ఖన్నా చెబుతుంటే… తాను కన్వీనర్‌ను అని అసలు ఆ తేదీలో ఎంపిక జరిగే విషయం తెలీదని సంయుక్త కార్యదర్శి అమితాబ్‌ చౌదరి చెబుతున్నారు. అయితే చౌదరి సమావేశాన్ని జరపకపోతే సీఈవో రాహుల్‌ జోహ్రి ఆదేశాల మేరకు ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో జాతీయ సెలక్షన్‌ కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేస్తుందని ఖన్నా తేల్చారు.
సీఓఏ ఆదేశాల‌తో భార‌త జ‌ట్టును రేపు ప్ర‌క‌టించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.అయితే నూతన పరిపాలక కమిటీ హెచ్చరించిన నేపథ్యంలో బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్‌ చౌదరి ఆధ్వర్యంలో సెలక్షన్‌ కమిటీ సమావేశం కానుంది. మరోవైపు సీఓఏతో సమావేశమైన ఈస్ట్, నార్త్‌ జోన్‌ సభ్యులు భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడకూడదనే నిర్ణయాన్ని వ్యతిరేకించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి ఉన్నప్పుడు లీగల్‌ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా సూచించింది సీఓఏ. కచ్చితంగా చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడాల్సిందేనని, వెంటనే జట్టును ప్రకటించాలని సీఓఏ ఆదేశించింది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. ఏషియన్‌ ఫెలోషిప్‌’ అవార్డును అందుకున్న స‌చిన్
  2. స‌చిన్‌కు తొలిసారి బ్యాట్‌ను ఇచ్చింది ఎవ‌రు….
  3. దిగ‌జారిన సింధూ,సైనైనెహ్వాల్ ర్యాంకులు
  4. టీమిండియా కొత్త‌ జెర్సీ వ‌చ్చేసింది…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -