ప్రేమ గుడ్డిదంటారు కాని…అది ఎంత పిచ్చిదో తరుచూ మనం చూస్తూనే ఉన్నాం.దీనికి బెస్ట్ ఎక్జాంపుల్ … చైతన్యపురిలో జరిగింది. ఓ ప్రేమోన్మాది తన ప్రేమను తిరస్కరించిందని ఓ అమ్మాయిపై దాడి
చేసి చంపేశాడు.అంతటితో
ఊరుకోకుండా ప్రక్కనే ఉన్న ఆమె సోదరిపై కూడా దాడి చేసి పొట్టన పెట్టుకున్నాడు.ఒక్కసారిగా జరిగిన ఈ విషాదంతో…. వారి ఇంట్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి.విషయంలోకి వెళితే….పాలమూరు జిల్లా షాద్‌నగర్‌కు
చెందిన శ్రీలేఖ, యామిని సరస్వతిలు చైతన్యపురిలో నివాసముంటున్నారు. శ్రీలేక దగ్గరిలో ఉన్న ఓ కళాశాలలో చదుకుంటుంది.అదే కళాశాలకు చెందిన అమిత్ ఆమెకు ఎన్నోసార్లు ప్రపోజ్ చేశాడు.అయితే ఆమె అతని ప్రేమను ఖాతరు చేయలేదు.దాంతో మండిన అమిత్ నేరుగా ఆమె ఇంటికే పోయి శ్రీలేకతో తనని ప్రేమిస్తావా లేదా అని అడిగాడు.మధ్యలో శ్రేలేక అక్క అయినటువంటి యామిని సరస్వతి అడ్డు రావడంతో పైశాచికంతో ఆమెను అమిత్ కత్తితో పొడిచి చంపేశాడు.అక్కడితో ఊరుకోకుండా ఆ ఉద్రేకంలో తాను ఇష్టపడిన అమ్మాయిని కూడా కత్తితో దాడి చేసి చంపేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ప్రస్తుతానికి అమిత్ పరారీలో ఉన్నాడు.
