వైనాట్ 175, why ap needs jagan ఇప్పుడు వైసీపీ నేతల ముందున్న లక్ష్యాలు ఇవే. తొలిసారి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది వైసీపీ. నవరత్నాలతో మెరుగైన పాలన అందించారు సీఎం జగన్. సంక్షేమానికే పెద్దపీట వేస్తూ ముందుకుసాగారు. ఈ నేపథ్యంలో రెండోసారి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
ఇందులో భాగంగా ఏపీకి జగనే ఎందుకు కావాలి అంటూ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం జగన్ ప్రతి బహిరంగ సభలో చెబుతున్న వై నాట్ 175 అన్న నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, అదే విధంగా జగనే మరోసారి ఎందుకు కావాలనేది గడపగడపకు వెళ్లి వివరించడం. గత 52 నెలల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను రాతపూర్వకంగా ప్రజలకు వివరించనున్నారు.
ఇక ఈ కార్యక్రమంతో ప్రజలకు దగ్గరవడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అన్ని స్థాయిల నాయకుల్ని ఒక్క తాటిపైకి తెచ్చేందుకు ఈ బస్సుయాత్ర ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు. అందుకే నేతలకు ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు సీఎం జగన్.
వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలను అడగాల్సిన ప్రశ్నలు, ప్రజలు లేవనెత్తే ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలనే దానిపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా పార్టీ మండల అధ్యక్షులు, కన్వీనర్ల సారథ్యంలో జరిగే ఈ క్యాంపెయిన్ తో న్నికల శంఖారావాన్ని పూరించింది వైసీపీ. ఇక ప్రతిపక్ష పార్టీలు మాత్రం వైసీపీకి దరిదాపుల్లో కూడా లేవు.
