- Advertisement -

ప్రశ్నిస్తే తప్పుడు కేసులు..మాకు ఇదే నేర్పిస్తున్నారా?

- Advertisement -

మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను తప్పుడు కేసుల్లో అరెస్ట్‌ చేసి 4 నెలలు కావొస్తోందన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా గతంలో మా ప్రభుత్వం వ్యవహరించి ఉంటే ఈ కేసులను ఆరోజే లేకుండా చేసేవాళ్లం అన్నారు. అధికారంలో ఉన్నామని ఎవరిపై అడ్డగోలుగా కేసులు పెట్టలేదు, మావాళ్లపై ఉన్న కేసులూ తొలగించలేదు… ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా టీడీపీ వ్యవస్థలను మేనేజ్ చేస్తుందని ఆరోపించారు.

అరాచకత్వం ఎలా ఉంటుందో…భవిష్యత్తులో ఎలా ఉండాలో ఈ ప్రభుత్వం మాకు నేర్పిస్తుందన్నారు సజ్జల. భవిష్యత్తులో ఎవరిని ఏం చేయాలో వైయస్ఆర్ సీపీలో ప్రతి ఒక్కరూ రాసి పెట్టుకునేలా ప్రవర్తిస్తున్నారు…ఇదే ధోరణితో జగన్ వ్యవహరించి ఉంటే మేం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే చంద్రబాబు జైల్లో ఉండేవారు అన్నారు.

అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే చంద్రబాబు తనపై ఉన్న కేసులు ఎత్తివేయించే పనులు చేస్తున్నాడు… నక్క తెలివితేటలు వైయస్ఆర్ సీపీకి అవసరం లేదు అన్నారు. ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం. వైయ‌స్ఆర్‌సీపీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్ట్ చేస్తున్నారు అని దుయ్యబట్టారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి…కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్తకొత్త పద్దతులు ఉపయోగిస్తున్నారు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -