- Advertisement -

జగన్‌ను విమర్శించేందుకే కూటమి ప్రభుత్వం!

- Advertisement -

మామిడి రైతులకు మద్దతు ధర ఏది చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. మీడియాతో మాట్లాడిన నాని.. 3 పార్టీల కూటమి సర్కార్ లో ఇద్దరు హామీలు ఇస్తారు. ఒకళ్ళు మాకు సంబంధం లేదు అంటారు అని ఎద్దేవా చేశారు.

ఈ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి రైతులు మద్దతు ధర లేక అల్లాడుతుంటే కనీసం ఆ ప్రాంతాల్లో పర్యటించాడా? చెప్పాలన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వెళ్లి ఆ రైతులని కలిస్తే దానిపై కూడా ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఒక్క ఎంపీ కానీ, కేంద్రమంత్రి కానీ రైతుల గురించి కేంద్రంతో మాట్లాడరా? చెప్పాలన్నారు.

టీడీపీ అనుకూల ఛానెల్స్ అన్ని బ్రతికేది జగన్‌ని తిడుతూనే… ఈ ఛానెల్స్ ని పెంచి పోషిస్తున్నది తెలుగుదేశం పార్టీనే. వైయస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన ప్రకటించే వరకు ప్రభుత్వం మామిడి రైతులకు మద్దతు ధర ఇవ్వనేలేదు అన్నారు. మామిడి, మిర్చి, పొగాకు వంటి ముఖ్య పంటల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలవాల్సిన సమయంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పట్ల రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. ప్రజల్ని మభ్యపెట్టి, జగన్‌ను విమర్శించేందుకు కొందరిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -