పింఛన్ల వ్యవహారంలో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. దివ్యాంగుల పింఛన్లలో అనర్హులు ఎక్కువగా ఉన్నారని పేరుతో వారిని తొలగించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇటీవలె ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి వికలత్వ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వైకల్య శాతం 40 కంటే తక్కువగా ఉన్నవారికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు నిలుపుదల చేస్తున్నట్లు సచివాలయ సిబ్బంది ద్వారా నోటీసులు కూడా అందించారు.
ఇక నోటీసులు అందుకున్న వారిలో 96 శాతానికి పైగా అప్పీలు చేసుకున్నారు. దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించి నోటీసులు అందుకున్న వారికి కూడా దివ్యాంగుల పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. అయితే అనర్హుల పేరుతో అర్హత కలిగిన వారిని తొలగించకూడదని… నకిలీలను తొలగిస్తే అభ్యంతరం లేదని దివ్యాంగుల సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇక నోటీసులు అందుకున్న వారిలో చాలా మంది అప్పీలు చేసుకోగా మరోసారి స్కానింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా పింఛన్ల వ్యవహారంలో ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియక దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
