- Advertisement -

ఆసియా కప్‌..కామెంటరీ ప్యానల్ ఇదే

- Advertisement -

17వ ఆసియా కప్ టి20 మంగళవారం యుఏఈలో ప్రారంభం కానుంది. భారత్, పాకిస్తాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ, ఒమన్, హాంకాంగ్ — మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నమెంట్‌లో బరిలోకి దిగుతున్నాయి. బుధవారం భారత్ తన తొలి మ్యాచ్‌ను యుఏఈతో ఆడనుంది.

ఈ నేపథ్యంలో భారత లెజెండ్స్ సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ — సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ బహుభాషా కామెంటరీ ప్యానెల్‌లో చేరారు.శాస్త్రి, గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, రాబిన్ ఉతప్ప, బజిద్ ఖాన్, వకార్ యూనిస్, వసీం అక్రం, రస్సెల్ ఆర్నాల్డ్, సైమన్ డౌల్.

హిందీ వ్యాఖ్యాతలలో సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, మాజీ భారత బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయక్, సబా కరీమ్ వంటి ప్రముఖులు ఉన్నారు. తమిళ ప్యానెల్‌లో.. భరత్ అరుణ్, డబ్ల్యూ.వి. రామన్, తెలుగు ప్యానెల్‌లో వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు తదితరులు ఉన్నారు.

సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భారత్ ఆసియా కప్ వేదికపై అడుగుపెడుతోంది అన్నారు గవాస్కర్. ధైర్యం, అనుభవం కలగలిపిన ఈ జట్టు భారత క్రికెట్ భవిష్యత్తుకు ప్రతీక. విభిన్నమైన, బహుముఖ ప్రతిభ కలిగిన జట్టు ఇది అని గవాస్కర్ అన్నారు. సూర్యకుమార్ యాదవ్ ముందుండి నడిపిస్తుండగా, ఉప కెప్టెన్ శుభ్‌మన్ గిల్ యువ నాయకత్వాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తున్నాడు… జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ స్థాయి ప్రతిభను జట్టుకు అందిస్తుంటే, తిలక్ వర్మ, హర్షిత్ రాణా వంటి యువత ఆటకు కొత్త ఉత్సాహం, లోతును ఇస్తున్నారు. ఆసియా కప్ 2025 ఈ జట్టుకు నిజమైన పరీక్ష వేదిక. సూర్య ప్రశాంతత, దూకుడు కలిగిన కెప్టెన్సీ కింద ఈ జట్టు కొత్త ప్రమాణాలు సృష్టిస్తుందని నమ్ముతున్నాను అని శాస్త్రి అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -