ఏపీ ఫేక్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి,వైసీపీ నేత జోగి రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు రాము, అనుచరుడు ఆరేపల్లి రాములను పోలీసులు అరెస్టు చేశారు.
జోగి రమేశ్ తోపాటు ఆయన సోదరుడు రాము, ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అదుపులోకి తీసుకొని భవానీపురం పీఎస్ కు తరలించారు. జోగి రమేశ్‍ను విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. నకిలీ మద్యం తయారీ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఆధారంగా జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారు.
జోగి రమేశ్ నివాసంకు సిట్ బృందం వచ్చిన సమాచారం అందుకున్న అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం ముందస్తు కుట్రలో భాగంగానే అన్యాయంగా జోగి రమేశ్‌ను నకిలీ మద్యం కేసులో ఇరికించి, అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ కోరుతూ పిటీషన్ వేశారు. వచ్చే మంగళవారం జోగి రమేష్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
