- Advertisement -

బన్నీ – అట్లీ మూవీలో శ్రీవల్లి!

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘AA22xA6’ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా నుంచి చిన్న అప్‌డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది.

ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా నటిస్తుండటం తెలిసిందే. ఆమెతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం కొంతకాలంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన పేర్లు వినిపించాయి. తాజాగా రష్మిక మందన షూటింగ్‌లో జాయిన్ అయిందన్న వార్త మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముంబైలో జరుగుతున్న షెడ్యూల్‌లో ఆమె అల్లు అర్జున్, జాన్వీ కపూర్, జిమ్ సర్భ్‌లతో కలిసి కీలక సన్నివేశాల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌తో పాటు భావోద్వేగ సీన్స్ కూడా చిత్రీకరిస్తున్నారని టాక్.

మరోవైపు రష్మిక ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న, ఇప్పటివరకు చేయని డిఫరెంట్ పాత్రలో కనిపించబోతుందన్న రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్‌కు అంతర్జాతీయ VFX టీమ్స్ పని చేస్తుండగా, 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -